హిట్టు కోసం అష్టకష్టాలు.. అయినా కరుణించని విజయం
టాలీవుడ్‌లో మీడియం రేంజ్ హీరోలు వరుస ఫ్లాపులతో సతమతమవుతున్నారు. రవితేజ, రామ్ పోతినేని, నితిన్ వంటి పలువురు నటులు హిట్ల కోసం విభిన్న ప్రయత్నాలు చేసినా ఫలితం దక్కడం లేదు. జోనర్లు మార్చినా, కొత్త కథలు ఎంచుకున్నా విజయం దక్కకపోవడంతో వారి పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. శర్వానంద్ మాత్రమే నారీ నారీ నడుమ మురారి సినిమాతో బ్రేక్ ఇచ్చారు.
ఇంకేం చేయాలి.. ఇంతకంటే ఇంకేం చేయాలి.. ఏం చేసినా వర్కవుట్ కాకపోతే మేమేం చేయాలి..? ఇంకేం చేస్తే మాకు హిట్స్ వస్తాయో మీరే చెప్పండి..? ఇంతకీ ఎవరిదీ బాధ అనుకుంటున్నారా..? ఇంకెవరిది.. మన మీడియం రేంజ్ హీరోలదే ఈ బాధంతా..! పాపం ఒక్కరో ఇద్దరో కాదు.. చాలా మంది హీరోలు ఫ్లాపుల్లోనే మగ్గిపోతున్నారు. మరి వాళ్ల పరిస్థితేంటిప్పుడు..? రవితేజకు ఫ్యామిలీ కలిసిరాలేదు.. రామ్‌కు క్లాస్ వర్కవుట్ అవ్వలేదు.. అల్లరి నరేష్‌కు సీరియస్ కుదర్లేదు.. నితిన్, వరుణ్ తేజ్‌కు ఏం చేయాలో అర్థం కావట్లేదు.. అఖిల్ ఏం చేసినా హిట్ రావట్లేదు.. గోపీచంద్ జోనర్ మిస్ అయ్యారు.. కళ్యాణ్ రామ్ మాస్ నుంచి దూరం అయిపోయారు.. శర్వానంద్ ఒక్కడే నారీనారీ నడుమ మురారి సినిమాతో వరస ఫ్లాపులకు బ్రేక్ వేసారు. అసలేం జరుగుతుంది మన హీరోల విషయంలో అనేది పెద్ద ప్రశ్నగా మారిపోయింది. రామ్ పోతినేనినే తీసుకోండి.. ఇస్మార్ట్ శంకర్ తర్వాత వరసగా మాస్ సినిమాలు చేసారు కానీ ఏదీ వర్కవుట్ అవ్వలేదు. సరే అని.. క్లాస్‌లోకి వెళ్లి ఆంధ్రా కింగ్ తాలూక చేస్తే ప్రశంసల దగ్గరే ఆగిపోయింది కానీ పైసలు మాత్రం రాలేదు. నెక్ట్స్ థ్రిల్లర్ సినిమా సైలెంట్‌గా ప్లాన్ చేస్తున్నారు. కామెడీ సినిమాలు చేసినపుడు కనీసం రెండేళ్లకోసారి హిట్ కొట్టిన అల్లరి నరేష్.. సీరియస్ వైపు వచ్చాక పూర్తిగా ఫ్లాపుల్లో కూరుకుపోయారు. నాందీతో ఓకే అనిపించినా.. ఆ తర్వాత హిట్టు రాలేదు. ఉగ్రంతో పేరు వచ్చినా హిట్టు రాలేదు. మొన్నొచ్చిన 12ఏ రైల్వే కాలనీ వచ్చిన సంగతే గుర్తు లేదు. కళ్యాణ్ రామ్ సైతం బింబిసార తర్వాత ట్రాక్ తప్పారు. రవితేజ పరిస్థితి అయితే మరీ దారుణం.. మాస్ కలిసిరావట్లేదు కదా అని సంక్రాంతికి భర్త మహాశయులకు విజ్ఞప్తి అంటూ క్లాస్ సినిమాతో వస్తే.. ఇక్కడా కలిసిరాలేదు. వరుణ్ తేజ్ కూడా మేర్లపాక గాంధీతో హార్రర్ కామెడీ ట్రై చేస్తున్నారు. నితిన్ హిట్టు కోసం ఏం చేస్తారో ఆయనకే తెలియాలి మరి. మొత్తానికి వీళ్ల కష్టాలు ఎప్పటికి తీరేనో..?
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Kerala Story 2: మరో కాంట్రవర్సీకి రంగం సిద్ధం.. రచ్చ చేస్తున్న కేరళ స్టోరీ 2 టీజర్
దసరాపై దండయాత్ర.. రేసులో ముగ్గురు స్టార్స్
TOP 5 ET: మరో వార్.. మరి ఈ సారి ఏమువుతుందో..? | నైజాంలో చిరు నయా రికార్డ్