The Kerala Story: ఓటీటీలోకి కేరళ స్టోరీ.. ఎప్పటి నుండి అంటే ??

|

May 13, 2023 | 9:42 AM

ద కాశ్మీరీ ఫైల్స్ సినిమా తర్వాత ఆ రేంజ్‌లో వివాదాలు చుట్టుముట్టేలా చేసుకున్న ఫిల్మ్ ద కేరళ స్టోరీ. సుదీప్తో సేన్ డైరెక్షన్లో.. అదా శర్మ లీడ్‌ రోల్లో తెరకెక్కిన ఈ ఫిల్మ్ రిలీజ్ ముందు నుంచే కాంట్రోకు కేరాఫ్ గా మారింది. ఓ వర్గం మనోభావాలను విపరీతంగా దెబ్బతీసింది. అలాంటి ఈ సినిమా రీసెంట్ గా..

ద కాశ్మీరీ ఫైల్స్ సినిమా తర్వాత ఆ రేంజ్‌లో వివాదాలు చుట్టుముట్టేలా చేసుకున్న ఫిల్మ్ ద కేరళ స్టోరీ. సుదీప్తో సేన్ డైరెక్షన్లో.. అదా శర్మ లీడ్‌ రోల్లో తెరకెక్కిన ఈ ఫిల్మ్ రిలీజ్ ముందు నుంచే కాంట్రోకు కేరాఫ్ గా మారింది. ఓ వర్గం మనోభావాలను విపరీతంగా దెబ్బతీసింది. అలాంటి ఈ సినిమా రీసెంట్ గా రిలీజ్‌అయి వివాదాల మధ్యే.. విరామం లేకుండా సాగుతోంది. సూపర్ డూపర్ కలెక్షన్లను రాబట్టుకుంటూ.. ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతోంది. ఆ క్రమంలోనే ఐదు రోజుల్లో ఏకంగా 56 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇక తాజాగా ఓటీటీ రిలీజ్‌కు కూడా రెడీ అయిపోతోంది. ఎస్ ! ఎన్నో వివాదాల మధ్య.. మరెన్నో అల్లర్ల మధ్య.. థియేటర్లో సక్సెస్‌ ఫుల్ గా రన్‌ అవుతున్న ద కేరళ స్టోరీ సినిమా తాజాగా ఓటీటీ స్క్రీనింగ్‌కు రెడీ అయిపోయింది. వన్‌ ఆఫ్ ది ఫేమస్ ఓటీటీ జెయింట్ జీ5 ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ను దక్కించుకుంది. ఇక మే5 రిలీజ్ అయిన ఈ సినిమా 45 రోజుల తర్వాత అంటే.. జూన్‌ లాస్ట్ వీక్‌లో జీ5లో స్ట్రీమింగ్ అవ్వనున్నట్టు.. తెలుస్తోంది. ఇక ఇదే విషయం సోషల్ మీడియాలో కూడా విపరీతంగా వైరల్ అవుతోంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Ustad Bhagat Singh: యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్

Liger: చిక్కుల్లో పూరీ.. రోడ్డెక్కిన లైగర్ బాధితులు..