అభిమాని చేసిన పనికి నివ్వెరపోయిన సంజయ్ దత్
ప్రముఖ కమెడియన్ కపిల్ శర్మ హోస్ట్ చేసే 'ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో' కార్యక్రమానికి దిగ్గజ నటులు సంజయ్‌దత్, సునీల్‌శెట్టి అతిథులుగా హాజరయ్యారు. కపిల్ శర్మ కార్యక్రమం నవ్వుల పువ్వులు పూయిస్తుందని అందరికీ తెలిసిన విషయమే. అలా సరదాగా సాగుతున్న ఈ కార్యక్రమంలో ఓ అభిమాని చేసిన వ్యాఖ్యలతో అక్కడున్నవారంతా దెబ్బకు సైలెన్స్ అయిపోయారు.
ఆ తర్వాత అంతా ఒక్కసారిగా నవ్వేశారు. షోలో భాగంగా కపిల్ శర్మ ప్రేక్షకులతో మాట్లాడుతుండగా, ఓ అభిమాని మైక్ అందుకుని సంజయ్ దత్‌తో మాట్లాడుతూ… “సంజయ్ సర్, ఈ రోజు నేను షోకు నా భార్య, నా గర్ల్‌ఫ్రెండ్ ఇద్దరితో కలిసి వచ్చాను” అని చెప్పడంతో సెట్‌లో పిన్ డ్రాప్ సైలెన్స్ నెలకొంది. ఈ మాట విన్న సంజయ్ దత్, సునీల్ శెట్టి, కపిల్ శర్మ, అర్చనా పూరన్ సింగ్ షాక్‌కు గురయ్యారు. ఒకేసారి భార్యను, ప్రియురాలిని ఒకేచోటికి తీసుకురావడం ఏంటని అందరూ నోరెళ్లబెట్టారు. కాసేపటికి తేరుకున్న సంజయ్ దత్, ఆ అభిమాని వద్దకు వెళ్లి నవ్వుతూ, “ఇది మీరెలా చేయగలిగారు? దయచేసి ఆ టెక్నిక్ ఏంటో మాకూ చెప్పండి” అని అడగడంతో షో మొత్తం నవ్వులతో దద్దరిల్లింది. ఈ సరదా సంభాషణకు సంబంధించిన ప్రోమో నెట్టింట వైరల్‌గా మారింది. నెటిజన్లు ఫన్నీ కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. “సంజయ్ దత్, సునీల్ శెట్టి షాక్ అయ్యారు, కానీ ఆ అబ్బాయి మాత్రం రాక్ చేశాడు” అని ఒకరు కామెంట్ చేయగా, “ఈ ఎపిసోడ్ టీఆర్పీ రికార్డులను బద్దలు కొట్టడం ఖాయం” అని మరొకరు రాశారు. “వర్క్-లైఫ్ బ్యాలెన్స్ అంటే ఇదేనేమో” అంటూ నెటిజన్లు సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కారు, బైక్ కొనే ప్లాన్‌లో ఉన్నారా? అయితే కాస్త ఆగండి..
Elephants: ఇకపై ఏనుగుల జాడ ముందే తెలిసిపోతుంది
నాన్ ఏసీలో.. ఏసీ ఎఫెక్ట్.. ఐడియా అదిరింది భయ్యా
