Thanuja: నాకో గుణపాఠం నేర్పారు.. వైరల్ అవుతున్న తనూజ

Updated on: Dec 24, 2025 | 8:47 AM

తనుజ బిగ్ బాస్ 15 వారాల జర్నీ రన్నరప్‌గా ముగిసింది. విమర్శలు ఎదుర్కొన్నా, ఆటపైనే దృష్టి పెట్టింది. బయటకు వచ్చాక భావోద్వేగ పోస్ట్ షేర్ చేసింది. అభిమానుల మద్దతు గొప్ప విజయమన్న తనుజ, ఇది ముగింపు కాదని, కొత్త ప్రయాణానికి ప్రారంభమని పేర్కొంది. వారి ప్రేమకు జీవితాంతం కృతజ్ఞతలు తెలిపింది.

బిగ్ బాస్ దృష్టిలో చిచ్చిర పిడుగు.. నెటిజన్స్ దృష్టిలో డ్రామా క్వీన్‌… హౌస్‌ మేట్స్‌ దృష్టిలో చీటికీ మాటికీ చికాకు పడే అమ్మాయి. ఇలా తనకు ఎన్ని పేర్లు పెట్టినా కానీ.. ఎన్ని విమర్శలు వచ్చినా కానీ.. తన ఆటపైనే ఫుల్ ఫోకస్‌ పెట్టింది తనూజ. బిగ్ బాస్ హౌస్‌లో ఎన్నో అడ్డంకులు దాటుకుంటూ 15 వారాలు గట్టిగా నిలబడింది. విన్నర్ కూడా తనే అవుతాననే భరోసాతో ఉంది. కానీ కట్ చేస్తే.. రన్నర్‌గా మిగిపోయింది. విన్నర్ ట్రోఫీకి ఒక్క అడుగు దూరంలో ఆగిపోయింది. ఈ క్రమంలోనే బయటికి వచ్చిన ఈమె.. సోషల్ మీడియాలో ఫస్ట్ పోస్ట్ పెట్టింది. మీరు వేసిన ఓట్లే నా గొంతుకగా వినిపించాయి. ‘మీరు నాపై పెట్టుకున్న నమ్మకమే అతి పెద్ద విజయం. ఈరోజు నేను బిగ్‌బాస్‌ హౌస్‌ను వీడానేమో కానీ.. దీనిద్వారా మీతో ఏర్పరుచుకున్న బంధాన్ని మాత్రం జీవితాంతం కొనసాగిస్తాను. ఇది ముగింపు కాదు.. కొత్త అధ్యాయానికి ప్రారంభం. మీ అందరికీ ఎప్పటికీ కృతజ్ఞురాలినై ఉంటాను’ అంటూ తన పోస్టులో రాసుకొచ్చింది. అంతేకాదు ప్రేక్షకుల ప్రేమాభిమానాలు చూస్తుంటే గర్వంగా ఉందని తనూజ తన పోస్టులో రాసుకొచ్చింది. ఈ జర్నీలో తాను ధైర్యంగా ఉండటం నేర్చుకున్నానని.. ఎన్నో గుణపాఠాలు నేర్చుకున్నానని.. జీవితానికి సరిపడా జ్ఞాపకాలు, ప్రేమను కూడబెట్టుకున్నానంటూ ఎమోషనల్ అయింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

KTR: కేసీఆర్ బయటకు వచ్చి గర్జిస్తే దానికి సమాధానం చెప్పలేకపోయారు

బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులకు నిరసనగా VHP ఆందోళన

ఢిల్లీలో నకిలీ ఇన్సూరెన్స్ అధికారుల మోసాలు

CM Chandrababu Naidu: కొత్త టెక్నాలజీ తీసుకొచ్చే బాధ్యత మాది

Gold Price Today: మళ్లీ పెరిగిన బంగారం ధర.. ఇవాళ తులం ఎంత అంటే ??