గేమ్ ఛేంజర్ కాంట్రవర్సీపై తమన్‌ రియాక్షన్‌

Updated on: Oct 01, 2025 | 6:00 PM

సంగీత దర్శకుడు తమన్ ఇటీవల ‘గేమ్ ఛేంజర్’ సినిమా వివాదంపై స్పష్టతనిచ్చారు. సినిమా పాటలు వైరల్ కాకపోవడంపై గతంలో తాను చేసిన వ్యాఖ్యలు కొరియోగ్రాఫర్లను ఉద్దేశించి చేసినవేనని, రామ్ చరణ్‌ను కాదని వివరించారు. సరైన హుక్ స్టెప్స్ రూపొందించడంలో విఫలమయ్యారని, రామ్ చరణ్ వంటి అద్భుతమైన డ్యాన్సర్‌ను సరిగా ఉపయోగించుకోలేదని పేర్కొన్నారు.

‘గేమ్ ఛేంజర్’ సినిమా చుట్టూ జరుగుతున్న చర్చ ఇంకా కొనసాగుతోంది. ఇటీవల ‘ఓజీ’ ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సినిమా ప్రస్తావన మరోసారి వచ్చింది. దీంతో సంగీత దర్శకుడు తమన్ గతంలో చేసిన కొన్ని కామెంట్స్‌పై ఇప్పుడు వివరణ ఇవ్వాల్సి వచ్చింది. ‘గేమ్ ఛేంజర్’ చిత్రం రామచరణ్ హీరోగా, శంకర్ దర్శకత్వంలో రూపొందిన భారీ ప్రాజెక్ట్. బాక్స్ ఆఫీస్ వద్ద దారుణంగా ఫెయిల్ కావడంతో అభిమానులు నిరాశ చెందారు. సినిమాతో పాటు, సంగీతం విషయంలోనూ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒక్క పాట కూడా వైరల్ కాకపోవడంపై అప్పట్లో తమన్ స్పందించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

హీరోయిన్స్‌ విషయంలో సస్పెన్స్‌

మూలవిరాట్ ను తాకిన సూర్యకిరణాలు

అంగరంగ వైభవంగా సాగుతున్న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు

అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో చరిత్ర సృష్టించిన పసికూన

హైదరాబాద్‌లో టీమిండియా క్రికెటర్‌ తిలక్‌వర్మ సందడి