Thalapathy Vijay: ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేస్తున్న దళపతి.. తగ్గేదేలే
దళపతి విజయ్ 'జననాయగన్' సినిమా ప్రచార కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి. డిసెంబర్ 31న ట్రైలర్, డిసెంబర్ 5, 6న సెకండ్ సింగిల్ విడుదల కానున్నాయి. మలేషియాలో డిసెంబర్ 27న భారీ ఆడియో లాంచ్ ప్లాన్ చేశారు. జనవరి 9న సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. విజయ్ స్వయంగా ప్రమోషన్లలో పాల్గొంటూ, సినిమాపై అంచనాలను పెంచుతున్నారు.
జననాయగన్ ప్రమోషనల్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ అవుతోంది. ఆల్రెడీ రిలీజ్‌కి కౌంట్ డౌన్ స్టార్ట్ కావడంతో, సినిమా కోసం డేట్స్ కేటాయించడానికి ముందుకొచ్చేశారట దళపతి విజయ్. ఇంతకీ ఏ రోజు ఏం ప్లాన్ చేశారు? లియో తర్వాత సిల్వర్ స్క్రీన్ మీద కనిపించలేదు దళపతి విజయ్. సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో దళపతి కనిపించిన ఆ సినిమా ఫస్ట్ డివైడ్ టాక్‌తో నడిచినా, తర్వాత సెటిల్ అయింది. లియో అయ్యీ కాగానే జననాయగన్ స్టార్ట్ చేసేశారు విజయ్. ఇప్పుడు రిలీజ్‌కి దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ లోనూ యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేయడానికి రెడీ అవుతున్నారు. జననాయగన్ అప్‌డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఆడియన్స్. ఆ క్యూరియస్‌ని అర్థం చేసుకుంటున్నాం.అందుకే న్యూ ఇయర్ గిఫ్ట్ గా ఈ నెల 31న ట్రైలర్ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని హింట్స్ ఇస్తున్నారు మేకర్స్. డిసెంబర్ 5, 6 తేదీల్లో సెకండ్ సింగిల్ రిలీజ్ ఉంటుంది. డిసెంబర్ 27న మలేషియాలో మాసివ్ ఆడియో లాంచ్‌ని ప్లాన్ చేస్తున్నారు. దళపతి తిరువిళా పేరుతో అత్యంత భారీగా గ్రాండ్ కాన్సర్ట్ ని కూడా ప్లాన్ చేస్తున్నారు. జనవరి 9న అత్యంత భారీ స్థాయిలో సినిమా విడుదలకు ప్లాన్ చేస్తోంది టీమ్. విజయ్ కెరీర్‌లో ఆఖరి సినిమాగా జననాయగన్ ట్రెండ్ అవుతోంది. ఫ్యూచర్లో ఆయన సినిమాలు చేసినా, చేయకపోయినా జననాయగన్ హిట్‌ని ఆయనకు కానుకగా ఇచ్చి తీరుతామని అంటున్నారు ఫ్యాన్స్.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మీ యాటిట్యూడ్‌ను మీ జేబులోనే పెట్టుకోండి.. క్యాబ్ డ్రైవర్ రూల్స్ వైరల్
ఆరు శతాబ్దాల మహావృక్షం చరిత్ర.. ఇది ఒక ఆధ్యాత్మిక అద్భుతం
ఫోన్‌లో మాటలు విన్నాడు.. మనసు గెలిచాడు
తిరుపతి మీదుగా దూసుకెళ్లనున్న బుల్లెట్ రైలు.. హైదరాబాద్ నుంచి రెండు గంటల్లోనే చెన్నైకి