తమిళనాడులో మన సినిమాలకు స్క్రీన్స్ లేవన్న కిరణ్ అబ్బవరం

Edited By: Phani CH

Updated on: Oct 11, 2025 | 10:22 AM

థియేటర్ల విషయంలో నిజంగానే తెలుగు, తమిళ హీరోల మధ్య తేడా ఉందా..? ఈ విషయంలో తెలుగు హీరోలకు అన్యాయం జరుగుతుందా..? కిరణ్ అబ్బవరం చెప్పినట్లు తమిళంలో మన వాళ్లకు థియేటర్స్ ఇవ్వట్లేదా..? ఈ విషయంపై బడా నిర్మాతలు ఏమంటున్నారు..? అసలు ఈ స్క్రీన్స్ గొడవేంటి..? కిరణ్ అబ్బవరం ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి.

నిజం చెప్పాలంటే.. గతేడాది క సినిమా సమయంలోనూ ఆయన ఇలాంటి కామెంట్సే చేసారు. మన సినిమాలకు తమిళంలో థియేటర్స్ ఇవ్వరని.. కానీ అక్కడ్నుంచి వచ్చిన హీరోలకు మన దగ్గర అగ్రపీఠం వేస్తారన్నారు కిరణ్. దానికి ప్రదీప్ రంగనాథన్ డ్యూడ్ సినిమానే ఎగ్జాంపుల్‌గా చూపించారు కిరణ్. అక్టోబర్ 18న కే ర్యాంప్ విడుదల కానుంది.. దానికి ఒక్కరోజు ముందు డ్యూడ్ వస్తుంది. దివాళికి పోటీ ఉన్నా కూడా.. మైత్రి మూవీ మేకర్స్ కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు థియేటర్లు బాగానే దొరికాయి. తమిళంలోనూ ఈ సినిమాకు క్వాలిటీ నెంబర్ ఆఫ్ స్క్రీన్స్ వచ్చాయి. కానీ కే ర్యాంప్ తమిళనాడులో రిలీజ్ చేద్దామంటే అక్కడి డిస్ట్రిబ్యూటర్లు స్క్రీన్లు ఇవ్వడం లేదన్నారు కిరణ్. ఈ విషయంపైనే ఇప్పుడు డ్యూడ్ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌లో నిర్మాత మైత్రి రవిశంకర్ క్లారిటీ ఇచ్చారు. మంచి కంటెంట్ ఉంటే ఏ సినిమా అయినా బ్లాక్ బస్టర్ అవుతుందని.. ఒకవేళ తమ డ్యూడ్ కన్నా అవతలి సినిమా బాగుంటే తమ షోలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. అంతే తప్ప థియేటర్ల గురించి మాట్లాడ్డం కరెక్ట్ కాదన్నారు రవి. ఏపీ, తెలంగాణలో దాదాపు 1700 థియేటర్స్ ఉన్నాయి.. కానీ తమిళనాడులో ఉన్నవి 800 స్క్రీన్సే. అందుకే అక్కడ పండగల సమయంలో తమ సినిమాలకు ఇంపార్టెన్స్ ఇస్తుంటారు. కానీ కిరణ్ అబ్బవరం అడిగిన దాంట్లోను తప్పులేదుగా అనే వాదన వినిపిస్తుంది. వాళ్లను మనం ఆదరిస్తున్నపుడు.. మనల్ని వాళ్లు అలాగే ఆదరించాలిగా.. చూద్దాం ఈ సిస్టమ్ ఎప్పటికి మారుతుందో..?

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నవంబర్‌లో థియేటర్లలో సందడి చేసే మూవీస్ ఇవే

Published on: Oct 11, 2025 09:44 AM