హీరోల సినిమాల సంఖ్య పెరగాలంటే.. కెప్టెన్లు స్పీడు పెంచాల్సిందేనా
ప్యాన్ ఇండియా సినిమాల ధోరణిలో దర్శకులపై ఒత్తిడి పెరుగుతోంది. మహేష్ బాబు, ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోలు తమ ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేసి, తదుపరి సినిమాలకు సిద్ధం కావాలని అభిమానులు కోరుతున్నారు. ఇది తెలుగు సినిమా పరిశ్రమను నిత్యం చురుకుగా ఉంచుతుంది. దర్శకులు హీరోల భాగాలను త్వరగా పూర్తి చేయాలనే డిమాండ్ ఉంది, ఇది ఇండస్ట్రీ వృద్ధికి దోహదపడుతుంది.
కెప్టెన్ కుర్చీ ఎవరికీ ఊరికే రాదు. వస్తే చాలా విషయాలను హ్యాండిల్ చేయాల్సి వస్తుంది. అందులోనూ ఇప్పుడు ప్యాన్ ఇండియా కల్చర్ హల్‌చల్ చేస్తున్న టైమ్లో కెప్టెన్ల మీద మామూలు ప్రెజర్ లేదు. అందులో స్పెషల్‌తో హీరోతో ముడిపెట్టి ఓ విషయం ట్రెండ్ అవుతోంది. ఇంతకీ ఏంటా గురుతరబాధ్యత? చూసేద్దాం వచ్చేయండి… గ్లోబ్ ట్రాటర్ మహేష్‌బాబుకి అతి త్వరలోనే పాస్ పోర్టు ఇచ్చి పంపేయాలి రాజమౌళి. జస్ట్ మహేష్ పోర్షన్‌ని ముందు తీసేసి పంపేయగలిగితే, సూపర్‌స్టార్ కెరీర్‌లో మరిన్ని సినిమాలు యాడ్ అవుతాయి. స్పిరిట్ సినిమా విషయంలోనూ సందీప్ ముందున్నటార్గెట్ ఇదే. డార్లింగ్ రిలేటెడ్ పోర్షన్‌ని కంప్లీట్ చేసి, ఆ తర్వాత మిగిలిన డీటైల్స్ షూట్ చేసుకోవాలనే రిక్వెస్టులు వినిపిస్తున్నారు అభిమానులు. అది జరిగితే నెక్స్ట్ మూవీకి డార్లింగ్ నయా లుక్‌లో కనిపించే వెసులు బాటు ఉంటుందనేది అందరి మాట. ఇటు డ్రాగన్ విషయంలో నీల్‌కి సేమ్ విషయాన్ని కన్వే చేయాలనుకుంటున్నారు వెయిటింగ్ లిస్టులో ఉన్న మేకర్స్. అట్లీ – అల్లు అర్జున్ షూట్ యమా స్పీడుగా జరుగుతోంది. అట్లీలాగా మిగిలిన డైరక్టర్లు కూడా స్పీడు పెంచాలన్నదే ఇప్పుడు టాక్. పుష్ప సీక్వెల్ సక్సెస్‌ని జనాలు ఎంజాయ్ చేస్తుండగానే అట్లీ మూవీ రెడీ అవుతోందన్నది ఐకాన్‌స్టార్ అభిమానుల్లో జోష్ నింపుతున్న విషయం. ఇటు పెద్ది విషయంలోనూ బుచ్చిబాబు సానా స్పీడు చూపించాల్సిన టైమ్ వచ్చింది. పెద్ది పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతున్నప్పుడే… నెక్స్ట్ సినిమా సెట్స్ కి చెర్రీ వెళ్లేలా, కనీసం మేకోవర్ అయ్యేలా వెసులుబాటు కల్పించాలంటున్నారు మెగాభిమానులు. వరుసగా స్టార్ హీరోలు ఎక్కువ సినిమాలు చేస్తే ఇండస్ట్రీ కూడా నిత్యకల్యాణం పచ్చతోరణంలా కళకళలాడుతూ ఉంటుందన్నది అందరూ ముక్తకంఠంతో చెబుతున్న మాట.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ధనుష్ దర్శకత్వంలో రజినీ సినిమా ??
కొత్త సినిమాలకంటే.. రీ రిలీజ్ సినిమాలపై ఆడియన్స్ ఆసక్తి
మాకు పక్కా హిట్ కావాల్సిందే.. తాడో పేడో తేల్చుకుంటున్న హీరోలు..
టాలీవుడ్ లో తప్పని హీరోయిన్ల కొరత.. కారణం అదేనా ??
Varanasi: రెండు భాగాలుగా రానున్న వారణాసి.. నెట్టింట వైరల్ అవుతున్న న్యూస్