2026లో డబుల్ డోస్ ఇస్తున్న స్టార్ హీరోలు వీడియో
సాధారణంగా ఏడాదికి ఒక సినిమా చేసే స్టార్ హీరోలు, 2026లో మాత్రం తమ వేగాన్ని పెంచుతున్నారు. చిరంజీవి, ప్రభాస్, నాని, వెంకటేష్ వంటి అగ్ర తారలు రెండేసి లేదా అంతకంటే ఎక్కువ చిత్రాలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. వారి రాబోయే ప్రాజెక్టులు, విడుదల తేదీలపై పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి.
సాధారణంగా ఏడాదికి ఒక్క సినిమా చేయడానికి స్టార్ హీరోలు ఎంతో కష్టపడుతుంటారు. అయితే, కాలం మారుతున్న కొద్దీ తమ వేగాన్ని పెంచాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో, 2026లో కొందరు స్టార్లు ఏకంగా రెండు సినిమాలతో ప్రేక్షకులను పలకరించనున్నారు. అన్నీ ఇప్పటికే ఖరారయ్యాయి. గత కొన్నేళ్లుగా ఏడాదికి ఒకటి లేదా రెండు సినిమాలతో వస్తున్న ప్రభాస్, గత ఏడాది కొంత విరామం తీసుకున్నారు. దీంతో 2025 బాకీ అంతా ఈ ఏడాదే తీర్చేస్తున్నారు. సంక్రాంతికి రాజాసాబ్గా రానున్న ప్రభాస్, వేసవి తర్వాత ఫౌజీతో సిద్ధమవుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం :
