మొన్న ప్రభాస్.. నిన్న చరణ్.. నేడు అల్లు అర్జున్.. అందరి టార్గెట్ ఆ దేశమే

Edited By: Phani CH

Updated on: Dec 05, 2025 | 6:08 PM

తెలుగు సినిమాలు జపాన్‌లో గణనీయమైన మార్కెట్‌ను సొంతం చేసుకుంటున్నాయి. RRR వంటి చిత్రాలు రికార్డులు సృష్టించగా, బాహుబలి కూడా విజయవంతమైంది. ఇప్పుడు అల్లు అర్జున్ 'పుష్ప 2' అక్కడ విడుదల కానుంది, దీని ద్వారా జపాన్ టాలీవుడ్‌కు కీలక మార్కెట్‌గా మారుతోంది. నిర్మాతలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు.

ఓవర్సీస్ అంటే నార్త్ అమెరికా మాత్రమే అనుకునేవాళ్లకు.. అది కాదంటూ ఒక్కో దేశం దాటేస్తూ.. ప్రపంచాన్ని జయించడానికి బయల్దేరుతున్నారు మన హీరోలు. ఈ క్రమంలోనే టాలీవుడ్‌కు సెకండ్ హోమ్‌లా మారుతుంది ఓ దేశం. తాజాగా మరో సెన్సేషనల్ సినిమా అక్కడ రిలీజ్ కాబోతుంది. ఎక్స్‌పాండ్ అవుతున్న ఆ దేశ మార్కెట్‌పైనే ఇవాల్టి ఎక్స్‌క్లూజివ్ స్టోరీ.. ఈ మధ్య తెలుగు సినిమాలకు జపాన్ ప్రధాన మార్కెట్‌గా మారుతోంది. అక్కడి ప్రేక్షకులు మన సినిమాలపై, హీరోలపై చూపిస్తున్న ప్రేమ అంతా ఇంతా కాదు. RRR అయితే పాతికేళ్ళ నాటి రజినీకాంత్ ముత్తు రికార్డులను తిరగరాసి.. మన జెండాను జపాన్ గడ్డపై ఎగరేసింది. దాదాపు 500 రోజులు ఆడి.. 136 కోట్లు వసూలు చేసింది ఈ చిత్రం. ట్రిపుల్ ఆర్ కంటే ముందు బాహుబలి సైతం జపాన్‌లో సత్తా చూపించింది. ఆ తర్వాత వచ్చిన దేవర, కల్కి 2898 AD లాంటి సినిమాలకు ఆ దేశంలో మంచి వసూళ్లు వచ్చాయి. ముఖ్యంగా ప్రభాస్ సినిమాలకు జపాన్‌లోనూ ఫ్యాన్ బేస్ పెరిగింది. రెబల్ స్టార్ సినిమాలు అదరగొడుతున్నాయక్కడ. దాంతో పెరిగిన మార్కెట్ క్యాష్ చేసుకుంటున్నారు నిర్మాతలు.ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ సైతం జపాన్ వెళ్తున్నారు. పుష్ప 2ను జపాన్ బాక్సాఫీస్ బరిలో దించుతున్నారు. జనవరి 16న జపాన్ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కానుంది ఈ సినిమా. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే పుష్ప ఫస్ట్ పార్ట్ అక్కడ విడుదల కాలేదు. కానీ రెండో భాగంలో కథకు జపాన్‌తో లింక్ ఉంటుంది.. ఈ నేటివిటీ అక్కడి ఆడియన్స్‌కు కనెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పుష్ప 2లోని కొన్ని సీన్స్ జపాన్‌లో షూట్ చేసారు.. కథలో టోక్యో లింక్ ఉంది. సినిమా ప్రమోషన్స్ కోసం అల్లు అర్జున్ గనుక జపాన్ వెళ్తే సినిమాకు మరింత కలిసిరానుంది. ఇప్పటికే 1800 కోట్లు వసూలు చేసిన పుష్ప 2.. జపాన్ గడ్డపై క్లిక్ అయితే ఇండియన్ హిస్టరీలోనే ఆల్ టైమ్ బిగ్గెస్ట్ హిట్స్‌లో ఒకటిగా నిలవడం ఖాయం. మరి చూడాలిక.. ఏం జరగబోతుందో..?

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రూ.500 కోట్లు వచ్చినా సేఫ్ కాదా.. ఇదెక్కడి బిజినెస్

ఎన్టీఆర్ సినిమాపై మైండ్ బ్లోయింగ్ అప్‌డేట్.. విషయం తెలిస్తే ఫ్యాన్స్ ఉక్కిరి బిక్కిరి అవ్వాల్సిందే

8 గంటలు పని చేయడానికి ఇదేమైనా జాబా.. ఇచ్చి పడేసిన రానా

ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే

ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ మలయాళ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా..