సక్సెస్‌ కోసం సవాలక్ష తిప్పలు.. ఇండస్ట్రీలో ఇప్పుడిదే చర్చ

Edited By:

Updated on: Jan 27, 2026 | 7:14 PM

టాలీవుడ్‌లో ఇప్పుడు ఫలితం మాత్రమే ముఖ్యం. నాణ్యత, కంటెంట్, వీఎఫ్‌ఎక్స్ విషయంలో రాజీ పడకుండా, స్క్రిప్ట్‌లను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు మేకర్స్. ఓటీటీల ప్రభావంతో ఖర్చులను నియంత్రిస్తూ, సీజన్ల క్లాష్ లేకుండా వ్యూహాత్మక విడుదలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. బాక్సాఫీస్ విజయమే లక్ష్యంగా సినీ జనాలు ముందుకు కదులుతున్నారు.

ఎన్నాళ్లు చేశాం? ఏం చేశామన్నది ఇంపార్టెంట్‌ కాదు… ఎలా చేశాం? ఎక్కడ చేశాం? అన్నదానితో అసలు పనే లేదు. ఫలితం ఏంటనేది మాత్రమే ఇంపార్టెంట్‌ బిగిలూ అని మాట్లాడుకుంటున్నారు సినీ జనాలు. యస్‌.. ఇండస్ట్రీలో ఇప్పుడు ఇదే హాట్‌ టాపిక్‌. కావాలంటే ఇంకో సారి రీచెక్‌ చేసుకోవడానికి, కలిసి కూర్చుని మాట్లాడుకోవడానికి కూడా రెడీ అంటున్నారు. ఏం చేసినా ఫర్వాలేదుగానీ… బాక్సాఫీస్‌ దగ్గర కాసుల గలగలలు వినిపించి తీరాలన్న ఏకైక టార్గెట్‌ కనిపిస్తోంది సినీ జనాల్లో… విశ్వంభర గతేడాదే స్క్రీన్స్ మీదకు రావాల్సింది. పలు మార్లు వాయిదా పడింది.. చివరికి మెగాస్టారే ముందుకొచ్చి.. వీఎఫ్‌ ఎక్స్ పనుల గురించి ఓపెన్‌ అయ్యారు. క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్‌ కావడం లేదని చెప్పారు. ఆ ఒక్క సినిమాకే కాదు.. టాప్‌ బ్యానర్లు చాలా ఇప్పుడు ఈ విషయం మీద స్ట్రిక్ట్ గా ఉన్నాయి. కథ పక్కాగా ఉండాలి. కంటెంట్‌ పర్ఫెక్ట్ గా రావాలి. విజువల్స్ గ్రాండియర్‌గా ఉండాలి. అప్పటిదాకా నో కాంప్రమైజ్‌ అనే వాతావరణం కనిపిస్తోంది టాలీవుడ్‌లో. చేతులు కాలాక ఆకులు పట్టుకోవడంలో అర్థం లేదు. ముందు నుంచే మేల్కోవాలి. అందుకే కథ పరంగా ఒకటికి రెండు సార్లు చెక్‌ చేసుకోవాలని డిసైడ్‌ అవుతున్నారు టాప్‌ మేకర్స్. రీసెంట్‌గా బాలకృష్ణ – గోపీచంద్‌ మలినేని సినిమా కథ విషయంలో మరోసారి రీచెక్‌ చేసుకోవడం వెనుక థాట్‌ ప్రాసెస్‌ కూడా ఇదే. అనూహ్యంగా కాల్షీట్లు పెరగడం, అమితంగా ఖర్చుపెట్టడం లాంటి మాటలకు చెక్‌ పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు మేకర్స్. లెక్కకు మించి ఖర్చు పెట్టి ఓటీటీలకు చుక్కలు చూపిస్తామంటే కుదరదు ఇప్పుడు. ఏ సినిమా రేంజ్‌ ఏంటో ఓటీటీలే డిసైడ్‌ చేస్తున్నాయి.. తమకు అందుబాటులోకి రాకుండా నిర్దాక్షిణ్యంగా నో చెప్పేస్తున్నాయి. అందుకే ఆచితూచి అడుగులు వేస్తున్నారు సినీ జనాలు. సీజన్ల మీద వరుసగా ఖర్చీఫులు వేసేస్తే వసూళ్లలో షేర్లు తప్పవు. రీసెంట్‌గా సంక్రాంతి టైమ్‌లోనూ ఆ విషయం మరోసారి ప్రూవ్‌ అయింది. అందుకే ఇకపై సీజన్ల షేరింగ్‌ విషయంలో కలిసి కూర్చుని మాట్లాడుకోవాలన్న అభిప్రాయం కూడా స్పష్టంగా వినిపిస్తోంది. కావాల్సినంత స్పేస్‌ తీసుకుని ప్రేక్షకులను పలకరిస్తే అందరికీ లాభం కలుగుతుందనే టాక్‌ నెమ్మదిగా స్ప్రెడ్‌ అవుతోంది ఇండస్ట్రీలో. దిబెస్ట్ సర్వ్ చేయాలన్న పోటీ ఉండటంలో తప్పులేదు. కానీ, అనవసరమైన భేషజాలకు వెళ్లకూడదనే ఆ థాట్‌ ప్రాసెస్‌ మంచిదే అంటున్నారు క్రిటిక్స్.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సూపర్‌ సక్సెస్‌లో బాలీవుడ్‌.. టాలీవుడ్‌ మేల్కోవాల్సిన టైమ్‌ వచ్చేసింది

Pawan Kalyan: ఒకటీ రెండు కాదు.. పవర్‌స్టార్‌ మూడు ప్రాజెక్టులు లైన్లో పెడుతున్నారా

Nithiin: జానర్ మార్చిన నితిన్‌.. ఈ సారైనా కలిసొస్తుందా

నయన్‌కి హిట్‌ ఇచ్చిన చిరు.. మరి త్రిష మాటేంటి

Kethireddy Venkatarami Reddy: వైసీపీ నేతలు కేసులకు భయపడే రోజులు పోయాయి

Published on: Jan 27, 2026 07:13 PM