ఫేక్ రివ్యూలపై యుద్ధానికి సిద్ధమవుతోన్న నిర్మాతలు
టాలీవుడ్‌లో ఫేక్ రివ్యూల బెడదపై నిర్మాతలు రాజేశ్ దండ, బన్నీ వాసు, దిల్ రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. యూట్యూబ్ రివ్యూలు, ట్రోలింగ్‌పై బన్నీ వాసు ఘాటుగా స్పందించగా, దిల్ రాజు ఫేక్ రివ్యూల కోసం డబ్బులు ఖర్చు చేయవద్దని సూచించారు. సినిమా బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తారని పేర్కొన్నారు.
టాలీవుడ్‌లో ఫేక్ రివ్యూలు, ట్రోలింగ్‌పై నిర్మాతలు రాజేశ్ దండ, బన్నీ వాసు, దిల్ రాజు తీవ్రంగా మండిపడ్డారు. తెలంగాణ ఎఫ్.డి.సి చైర్మన్ దిల్ రాజు, నిర్మాత బన్నీ వాసు యూట్యూబర్లు, వెబ్‌సైట్ల అడ్డగోలు రివ్యూలను ఇకపై సహించేది లేదని స్పష్టం చేశారు. ఇటీవల విడుదలైన మిత్ర మండలి సినిమా ఈవెంట్‌లో బన్నీ వాసు రివ్యూయర్‌లకు గట్టి హెచ్చరిక ఇచ్చారు. తనను తొక్కేయడానికి కుట్రలు జరుగుతున్నాయంటూ మండిపడ్డారు. ఒక సినిమాను తొక్కేస్తే ఇంకో సినిమా ఆడుతుందనే భ్రమల నుంచి బయటకు రావాలన్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కె-ర్యాంప్ నిర్మాత ఆగ్రహానికి కారణం ఏంటి ?
వైట్ హౌస్ లో ట్రంప్ దీపావళి వేడుకలు
తెలుగు సినిమాల తలరాతను ఆ వెబ్‌సైట్లే శాసిస్తున్నాయా ??
