Ustaad Bhagat Singh: పవన్‌ ఫ్యాన్స్‌లో మరింత జోష్‌… రికార్డులు బ్రేక్ అవుతాయా ??

Updated on: Mar 16, 2026 | 9:14 PM

సుప్రీంకోర్టు తీర్పు టాలీవుడ్‌కు ఊరటనిచ్చింది. టికెట్ ధరలు పెంచేందుకు 90 రోజుల ముందు జీవో ఇవ్వాలన్న హైకోర్టు నిబంధనపై సుప్రీం స్టే విధించింది. ఈ నిర్ణయం పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్కు తక్షణ ప్రయోజనం చేకూర్చింది. త్వరలో ఈ సినిమా టికెట్ ధరలు పెరిగే అవకాశం ఉంది, ఇది కలెక్షన్లపై సానుకూల ప్రభావం చూపనుంది.

అప్‌కమింగ్ చిత్రాలకు సుప్రీంకోర్టు గుడ్‌న్యూస్ చెప్పింది. టికెట్ రేట్లు పెంచుకోవాలంటే 90 రోజుల ముందు జీవో ఇవ్వాలన్న నిబంధనపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈ నిర్ణయం టాలీవుడ్‌కు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర బృందానికి పెద్ద ఊరటగా మారింది. సంక్రాంతి రిలీజ్‌ల సమయంలో టికెట్ రేట్ల హైక్ గురించి పెద్ద చర్చ జరగగా, అప్పుడు హైకోర్టు 90 రోజుల నిబంధనను విధించింది. తాజా సుప్రీంకోర్టు తీర్పుతో ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలు ఊపిరి పీల్చుకున్నారు. హైకోర్టు నిర్ణయంపై ఉస్తాద్ నిర్మాతలు సుప్రీంకోర్టును ఆశ్రయించగా, ఉస్తాద్ టీమ్‌కు అనుకూలంగా తీర్పు వచ్చింది. దీంతో ఈ నెల 19న విడుదల కానున్న ఈ సినిమాకు ఆంధ్రాతో పాటు తెలంగాణలో టికెట్ రేట్లు పెరిగే అవకాశం స్పష్టమైంది. ఈ రెండు మూడు రోజుల్లోనే బుకింగ్స్ ఓపెన్ అయ్యే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వెండితెర మీద కొత్త ప్రపంచాలు… లెక్క సరిపోతుందా ??

Trisha: టాప్‌లో ట్రెండ్ అవుతున్న త్రిష పేరు..

రూటు మారుస్తున్న దర్శకులు..మ్యాజిక్‌ రిపీట్ చేస్తారా

సిల్వర్‌ స్క్రీన్‌కు నయా టెక్నాలజీ.. అంతా హాలీవుడ్‌ రేంజేనా

తండ్రి మృతదేహం సాక్షిగా.. పదో తరగతి పరీక్ష రాసిన కొడుకు

Loading...
Unable to load recommendations.
Follow Us