Suresh Babu: ఫిల్మ్ ఛాంబర్ కొత్త అధ్యక్షుడు సురేష్ బాబు ఏడాదిలో ఏం చేయబోతున్నారు

Edited By:

Updated on: Dec 31, 2025 | 4:21 PM

ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడిగా సురేష్ బాబు ఎన్నికయ్యారు. అయితే ఆయన ముందు అనేక సమస్యలున్నాయి. టికెట్ రేట్ల వివాదం, యూఎఫ్‌ఓ/క్యూబ్ సేవా ఛార్జీల తగ్గింపు, థియేటర్ల మనుగడకు పన్ను రాయితీలు, ఛాంబర్ అంతర్గత సంస్కరణలు వంటి కీలక అంశాలపై కొత్త కార్యవర్గం దృష్టి సారించాల్సి ఉంది. ఈ సవాళ్లను అధిగమించి టాలీవుడ్‌కు ఎలా మేలు చేస్తారో చూడాలి.

హోరాహోరీగా జరిగిన ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలు ముగిసాయి.. నూతన కార్యవర్గం వచ్చేసింది.. ఛాంబర్‌కు కొత్త అధ్యక్షుడు వచ్చాడు.. అంతా బాగానే ఉంది కానీ సురేష్ బాబు గెలిచిన ఆ అధ్యక్ష పదవి అంత ఈజీ కాదు. దాని చుట్టూ ఎన్నో సమస్యలున్నాయి.. చక్కబెట్టాల్సిన విషయాలున్నాయి.. చెప్పాల్సిన సమాధానాలున్నాయి. మరి ఛాంబర్ ముందున్న ఆ సమస్యలేంటో ఎక్స్‌క్లూజివ్‌గా చూద్దామా..? కొన్ని రోజులుగా ఇండస్ట్రీలో ఆసక్తి పుట్టించిన ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలు పోటాపోటీగా జరిగినా.. ప్రశాంతంగా ముగిసాయి. సురేష్ బాబు నూతన అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. ఆయన గెలిచిన కుర్చీ అంత ఈజీ మాత్రం కాదు.. ఆ కుర్చీ చుట్టూ చక్కబెట్టాల్సిన సమస్యలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా టికెట్ రేట్ల గురించి కొత్త ఛాంబర్ ఏం చేయబోతుందా అనే ఆసక్తి అందరిలోనూ ఉంది. APలో టికెట్ రేట్లపై ఈ మధ్యే చర్చించారు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్. ఉన్నతాధికారులతో పాటు కొందరు దర్శక నిర్మాతలతో మాట్లాడి.. అందరికీ ఆమోదయోగ్యమైన రేట్లు పెడతామన్నారు. దీనిపై కొత్త ఛాంబర్ ఏ మేరకు కో ఆర్డినేట్ చేస్తుందనేది చూడాలి. అలాగే తెలంగాణలో హైక్స్ ఉండవని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. పండక్కి ముందు ఇది కూడా ఛాంబర్ తీర్చాల్సిన పెద్ద సమస్యే. ఛాంబర్ ముందున్న మరో ప్రధాన సమస్య.. సర్వీస్ ప్రొవైడర్లైన UFO, క్యూబ్ రేట్లు తగ్గించాలనే చిన్న నిర్మాతల గోడు వినడం. దీనిపై సురేష్ బాబు వర్గం దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. స్వయంగా ఆయనే సైక్ సిద్ధార్థ్ లాంటి చిన్న సినిమాలను విడుదల చేస్తూ ఉంటారు కాబట్టి.. అందులోని సమస్యలు సురేష్ బాబుకు బాగా తెలుసు. సింగిల్ స్క్రీన్స్‌లో వినోదపు పన్ను, కరెంట్ ఛార్జీలపై రాయితీల కోసం ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలతో చర్చించి.. థియేటర్స్‌ను రక్షించే బాధ్యత కూడా ఛాంబర్‌పైనే ఉంది. వీటితో పాటు ఛాంబర్‌లో ఉన్న మల్టీ ఓటింగ్ సిస్టమ్ స్ట్రీమ్ లైన్ చేయడం, 24 క్రాఫ్ట్స్ సమస్యలపై కూడా ఫోకస్ చేస్తున్నారు కొత్త టీం. ఇలా చాలా చేరుకోవాల్సిన లక్ష్యాలు, తీర్చాల్సిన సమస్యలు ఛాంబర్ ముందున్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

క్రిస్మస్ విన్నర్ ఎవరు.. పైచేయి ఆ హీరోదేనా..?