Ranya Rao: రన్యా వెనక.. తెలుగు నటుడు.. దిమ్మతిరిగే ట్విస్ట్
దుబాయ్ నుంచి 14.2 కిలోల బంగారాన్ని అక్రమంగా రవాణా చేసినందుకు మార్చి 3న బెంగళూరు విమానాశ్రయంలో కన్నడ నటి రన్యా రావు పోలీసులకు చిక్కింది. పోలీసులు చేసిన ఇన్వెస్టిగేషన్‌లో సంచలన విషయాలు తెలిశాయి. ఇక తాజాగా ఈ బంగారు అక్రమ రవాణాలో తెలుగు నటుడి ప్రమేయం కూడా ఉన్నట్టు పోలీసులు తేల్చడం ఇప్పుడు టాలీవుడ్‌తో పాటు తెలుగు టూ స్టేట్స్‌లో హాట్ టాపిక్ అవుతోంది.
తాజాగా రన్యా రావు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. రన్యారావు వెనుక కింగ్‌పిన్‌గా ఉన్న తెలుగు నటుడు తరుణ్ రాజ్‌ను పోలీసులు ఇవాళ ఉదయం అరెస్ట్ చేశారు. గోల్డ్ స్మగ్లింగ్‌లో విరాట్ అలియాస్ తరుణ్‌రాజ్ కొండూరుది కీలక పాత్రగా గుర్తించారు DRI అధికారులు. 2019 నుంచి రన్యారావుతో తరుణ్‌రాజ్‌కు సంబంధాలు ఉన్నాయని తెలుస్తుంది. దుబాయ్‌లో కస్టమ్స్ తనిఖీలను తప్పించుకోవడానికి.. తరుణ్‌రాజ్ తన US పాస్‌పోర్ట్ ఉపయోగించాడు. US పాస్‌పోర్ట్‌తో చెకింగ్ లేకుండానే దుబాయ్ నుంచి బెంగుళూరుకు గోల్డ్ స్మగ్లింగ్ చేశారు. అంతే కాదు తరుణ్‌రాజ్‌తో కలిసి పలుమార్లు దుబాయ్ వెళ్ళింది రన్యారావు. ఇక ఇప్పుడు స్మగ్లింగ్ కేసులో తరుణ్‌రాజ్‌ను DRI టీమ్ ప్రస్తుతం విచారిస్తోంది. ఇలా ఇంకెన్ని విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Janhvi Kapoor: భయంకరమైన ప్రమాదం.. జాన్వీ కపూర్ ఎమోషనల్
Vishnu Priya: పాపం విష్ణు ప్రియ! 11 మందిలో ఫస్ట్ బుక్కైంది ఈమే..
Samantha: సెలైన్ బాటిల్స్.. మందు బిళ్లలు! ఒక్క ఫోటోతో బయపడ్డ సమంత ఆరోగ్య పరిస్థితి