మారు ఆలోచించకుండా 50 కోట్లు ఇచ్చాడు అది ప్రభాస్ గొప్పతనం!

Updated on: Aug 22, 2025 | 7:06 PM

సిల్వర్ స్క్రీప్‌ పై యాక్షన్ హీరోగా కనిపించి అదరగొడతాడే కానీ... ఆఫ్ స్క్రీన్ లో మాత్రం చాలా ఇన్నోసెంట్ నవ్వుతో.. మృధుస్వభావిగా కనిపిస్తాడు ప్రభాస్. పద్దతైన పలకరింపు.. పెద్దలంటే గౌరవం! మాటిస్తే మరిచిపోని గుణం! వీటన్నింటితో పాటే.. అతిథులకు గుర్తుండిపోయేలా ఆతిథ్యం.! కదిలిస్తే చాలు ప్రభాస్‌ నియర్ అండ్ డియర్స్ అండ్ ఫ్యాన్స్‌ ఇదే చెబుతారు.

ఆయన్ను పొగడ్తలతో ఆకాశానికెత్తుతారు. ఇప్పుడో కోలీవుడ్ ప్రొడ్యూసర్ కూడా ప్రభాస్‌ మంచితనం గురించి ఓ ఈవెంట్లో వివరించాడు. ప్రొడ్యూసర్ , డిస్ట్రిబ్యూటర్స్ బాగు కోసం 50 కోట్లు వెనక్కి ఇచ్చిన ఆ తీరును మెచ్చుకున్నాడు. ప్రభాస్‌ లాంటి గుణం మరే హీరోకూ లేదని.. చెప్పుకొచ్చాడు. బాహుబలి సినిమాతో భారీ హిట్ అందుకున్న ప్రభాస్ ఆతర్వాత కొన్ని ఫ్లాప్స్ చూడాల్సి వచ్చింది. ఈ క్రమంలో ప్రభాస్ నటించిన సాహో , రాధేశ్యామ్, ఆదిపురుష్ ఇలా వరుస గా ఫ్లాప్స్ అందుకున్నాడు రెబల్ స్టార్.. దీని గురించే ఆ నిర్మాత మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన రాధేశ్యామ్ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలై ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమాకు ప్రభాస్ రూ. 100కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నాడట. అయితే సినిమా నిరాశపరచడంతో రూ. 50కోట్లు తిరిగి ఇచ్చేసి.. నష్టపోయిన డిస్టిబ్యూటర్స్ కు ఇవ్వాలని కోరాడట.ఈ విషయాన్నే ఓ తమిళ్ నిర్మాత తాజాగా రివీల్ చేశాడు. దీంతో ప్రభాస్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాడు. అయితే ఈ వీడియో ఎప్పటిదో క్లారిటీ లేదు కానీ.. ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ వీడియో పై ప్రభాస్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మా అన్న మనసు బంగారం, మనసున్న మా రాజు అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మొత్తంగా 310 కోట్లు విరాళంగా.. సాయంలో ఈ హీరోకు సరిరావు ఎవ్వరూ..

మనసిచ్చినోడిని మనువాడిన జేజమ్మ