మనసిచ్చినోడిని మనువాడిన జేజమ్మ
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి నటించిన లేడీ ఓరియెంటెడ్ చిత్రం అరుంధతి. దివంగత దర్శకుడు కోడి రామకృష్ణ తెరకెక్కించిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. జేజమ్మగా అనుష్క అభినయానికి ప్రేక్షకులు ముగ్దులయ్యారు. అయితే ఇదే సినిమాలో అనుష్క చిన్నప్పటి పాత్రలో ఒక పాప అద్బుతంగా నటించింది. అప్పట్లో అందర్నీ ఆకట్టుకుంది.
ఆమె పేరే దివ్య నగేష్. అరుంధతి సినిమాలో నటనకు గానూ బెస్ట్ ఛైల్డ్ ఆర్టిస్టుగా నంది అవార్డు కూడా అందుకుంది దివ్య. ఆ తర్వాత సింగం పులి, అపరిచితుడు చిత్రాల్లోనూ నటించి మెప్పించింది. ఇక పెద్దయిన తర్వాత నటిగా కొన్ని సినిమాల్లోనూ యాక్ట్ చేసిన దివ్య తాజాగా తన జీవితంలో సరికొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టింది. తన మనసుకు నచ్చిన వాడితో కలిసి మూడుముళ్ల బంధంలోకి అడుగు పెట్టింది. గత ఐదేళ్లుగా సహనటుడు, కొరియోగ్రాఫర్ అజయ్ కుమార్ తో ప్రేమలో ఉన్న దివ్య.. ఈ ఏడాది జనవరిలో నిశ్చితార్థం చేసుకుంది. ఇప్పుడు తమ ప్రేమ బంధాన్ని మరింత ముందుకు తీసుకెళుతూ వైవాహిక బంధంలోకి అడుగు పెట్టింది. ఆగస్టు 18న దివ్య- అజయ్ కుమార్ ల వివాహం ఘనంగా జరిగింది. కేవలం ఇరు కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితుల సమక్షంలో దివ్య- అజయ్ కుమార్ ల పెళ్లి వేడుక జరిగినట్లు తెలుస్తోంది. దివ్య నాగేష్ తన పెళ్లి ఫొటోలు షేర్ చేయకపోయినా ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ కి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అలాగే తన బ్యాచిలర్ పార్టీ పిక్స్ ను కూడా పంచుకుంది. ప్రస్తుతం ఈ ఫోటోలతో పాటు.. ఆమె పెళ్లి ఫోటోలు కూడా నెట్టింట బాగా వైరలవుతున్నాయి. వీటిని చూసిన పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు దివ్య- అజయ్ కుమార దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మునిగిన ముంబై.. ఆర్థిక రాజధాని అతలాకుతలం
Weather Update: మరో మూడు రోజులు వానలు దంచుడే దంచుడు .. ఈ జిల్లాలకు బిగ్ అలర్ట్..
Roopchand Fish: రక్తం రుచి మరిగిన చేప.. ఇతర చేపలకు భిన్నం
పీఎం కిసాన్ డబ్బులు రాలేదా? అయితే ఇలా చేయండి
ప్రేమించిన అమ్మాయికి ‘బాంబు’ గిఫ్ట్ పార్శిల్ అందుకున్న భర్త.. చివరికి
ఇంటర్వ్యూలో ప్యాకేజీకి ఓకే చెప్పి.. తీరా చేరేముందు అదిరే ట్విస్ట్
రోడ్డు గుంతల అద్భుతం.. చనిపోయిన వ్యక్తి లేచి కూర్చున్నాడు
నానో కారులో.. దేశాన్ని చుట్టేస్తున్న 75 ఏళ్ల కుర్రాడు
హైదరాబాద్లో.. కట్టెలు, బొగ్గులకు ఫుల్ డిమాండ్ !!
గ్యాస్ సెగ.. మళ్లీ లాక్డౌన్ తప్పదా
విమానంలో బీడీ తాగాడు.. కట్ చేస్తే.. ఇలా అయ్యాడు
చిలుక జోస్యం చెప్పే వ్యక్తి చేతిలో.. లక్షలు పోగొట్టుకున్న అధికారి

