Loading video

నా శరీరం.. మీకు సరదానా? దయచేసి ఆ వీడియో షేర్ చేయకండి!

|

Mar 31, 2025 | 9:08 AM

శృతి నారాయణన్.. ఇప్పుడు కోలీవుడ్ ఇండస్ట్రీలో దుమారం రేపుతున్న పేరు. సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించిన ఈ అమ్మడు.. ఇప్పుడిప్పుడే నటిగా గుర్తింపు తెచ్చుకుంటుంది. ఈ క్రమంలోనే ఇటీవల ఆమె ప్రైవేట్ వీడియో లీక్ అంటూ ఓ న్యూస్ తెగ వైరల్ అయింది. అలాగే ఆమెకు సంబంధించిన ఓ వీడియో కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ వీడియో చూస్తుంటే.. కొందరు స్కామర్లు ఆమె ఒంటిపై దుస్తులు లేకుండా వీడియో రికార్డ్ చేసినట్లు తెలుస్తోంది. ఇక ఆ తర్వాత ఆ వీడియోను పలు వెబ్ సైట్లలో అప్లోడ్ చేయడంతో ఇప్పుడు నెట్టింట వీడియో వైరల్ గా మారింది. తాజాగా ఈ వ్యవహారంపై శ్రుతి నారాయణన్ స్పందించింది. ఆ వీడియోను షేర్ చేయడం ఆపేయండి అంటూ రిక్వెస్ట్ చేసింది.ఇంతకీ శృతి ఏమని రిక్వెస్ట్ చేసింది అంటే..!

“నా గురించి వైరలవుతున్న వీడియోను షేర్ చేయడం మీకు సరదాగా ఉందేమో.. కానీ ఇది నా జీవితం. నాకు, నా కుటుంబానికి ఇది కఠినమైన పరిస్థితి. నేను కూడా ఒక అమ్మాయినే, నాకు భావోద్వేగాలు ఉన్నాయి. కానీ మీరెందుకు ఇంతగా దిగజారి ప్రవర్థిస్తున్నారు. నా చుట్టూ ఉండేవారికి ఎమోషన్స్ ఉంటాయి. దయచేసి ఆ వీడియోను వైరల్ చేయొద్దు. మీకు మరీ అంత కావాల్సి ఉంటే మీ అమ్మదో.. చెల్లిదో, ప్రేయసిదో వీడియోస్ చూడండి. వాళ్లు కూడా అమ్మాయిలే కదా.. వారికి కూడా నాలాంటి శరీరమే కదా ఉంటుంది. కాబట్టి వారి ప్రైవేట్ వీడియోస్ చూసి ఆనందించండి. మీకు ఇదంత కామెడిగా ఉందేమో.. కానీ ఒకరి జీవితం అని గ్రహించట్లేదు. అవకాశాల కోసం ఇంతకు దిగజారాలా.. ? అని నన్ను తిడుతూ కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకు ఎప్పుడూ ఆడవారినే తప్పుపడతారు.. ? ఆ వీడియో లీక్ చేసినవారిది.. అలాంటి వీడియోస్ చూసేవారిది తప్పు కాదా.. ? ఎందుకిలా దారుణంగా ప్రవర్తిస్తున్నారు. డీప్ ఫేక్ వీడియోస్ వల్ల జీవితాలు నాశనం అవుతున్నాయి. దయచేసి ఇక ఆపేయండి. లింకుల కోసం అడగడం మానుకోండి. మనిషిగా ప్రవర్తించండి. లీక్ అయిన వీడియోలను షేర్ చేయడం భారతదేశంలో నేరపూరిత నేరం, అది నిజమైనదైనా లేదా డీప్‌ఫేక్ అయినా, అది నేరం. దీని కింద చర్య తీసుకోగల చట్టపరమైన నిబంధనలు ఇక్కడ ఉన్నాయి. ” అంటూ రాసుకొచ్చింది.

మరిన్ని వీడియోలు :

స్టార్ హీరోలకు దిమ్మతిరిగే షాక్.. ఇప్పుడు ‘ఎంపురాన్’ సినిమా పరిస్థితి దారుణం 

వందల కోట్ల ఆశ చూపించి.. గ్రామస్తులను మోసం చేసిన నటుడు

ఉగాది రోజు బాలయ్య ఫ్యాన్స్‌కు దిమ్మతిరిగే సర్‌ప్రైజ్‌!