కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కంగువ ప్రమోషన్లలో టాలీవుడ్ ఇండస్ట్రీలో తన బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరో చెప్పారు సూర్య. అంతేకాదు ఆ స్టార్ హీరోకు తనకు ఉన్న అనుబంధాన్ని చెప్పారు. ఇప్పుడు ఈ మాటలతో నెట్టింట వైరల్ అవుతున్నారు సూర్య. తెలుగు ఇండస్ట్రీలో రామ్ చరణ్ , అల్లు అర్జున్, మహేష్ బాబు, ప్రభాస్ మంచి మిత్రులని చెప్పిన సూర్య.. అలాంటి ఫ్రెండ్స్ తనకు దొరకడం చాలా సంతోషంగా ఉందన్నారు. దాంతో పాటే ప్రభాస్ తనకు బెస్ట్ ఫ్రెండ్ అని.. ప్రభాస్‌ను కలవడమంటే తనకు చాలా ఇష్టమన్నారు సూర్య. ఇక బాహుబలి సినిమా షూటింగ్ సమయంలో బయటి నుంచి ఎవరూ సెట్‌కి కూడా వెళ్లలేదని.. కానీ తాను వెళ్ళానన్నారు. ప్రభాస్ తనకు చాలా స్వీట్ ఫ్రెండ్ అని.. ఒకసారి తనను భోజనానికి పిలిచాడని చెప్పాడు. ఆ రోజు ఇతర పనుల వల్ల చాలా ఆలస్యమైందని.. దాదాపు 11:30 గంటలకు ప్రభాస్‌ని కలిశానని… అప్పటి వరకు వాళ్ళు కూడా తినకుండా తన కోసం ఎదురుచూడడం షాక్ అనిపించిందని చెప్పారు సూర్య. అంతేకాదు ఆ రోజు చాలా ఎంజాయ్ చేశాం. మళ్లీ ప్రభాస్‌తో డిన్నర్ చేసేందుకు వెయిట్ చేస్తున్నా… అంటూ చెప్పారు ఈ స్టార్ హీరో.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.