తను చదివించిన డాక్టర్లను చూసి స్టేజ్‌పైనే కన్నీళ్లు పెట్టుకున్న స్టార్ హీరో
స్టార్ హీరో సూర్య సినిమాల్లో తన పర్ఫార్మెన్స్‌తోనే కాదు.. పరోపకార గుణంతో కూడా అందర్నీ ఫిదా చేస్తుంటాడు. వరదలు, ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు బాధితులకు సాయం చేయడంలో ఈ స్టార్ హీరో ముందుంటాడు. పేద, అనాథ విద్యార్థులకు ఉచితంగా విద్యను అందిస్తుంటాడు. ఇందు కోసం ఏకంగా అగరం ఫౌండేషన్‌నే రన్ చేస్తున్నాడు సూర్య.
ఈ ఫౌండేషన్ ద్వారా వేలాది మందిని ఉచితంగా చదివిస్తున్నాడు. పేదలు, అనాథ పిల్లలను ఎంపిక చేసి వారికి కేజీ టూ పీజీ విదయను ఉచితంగా అందిస్తున్నాడు. ఇందు కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాడు. అంతేకాదు అగరం ఫౌండేషన్ స్కూల్ కోసం తమ ఇంటినే ఉదారంగా ఇచ్చేసిన గొప్ప మనసు సూర్యది. అయితే ఈ ఫౌండేషన్ ప్రారంభించి.. 15 ఏళ్లు పూర్తి అయింది. ఈ సందర్భంగా చెన్నైలో ఒక గ్రాండ్ ఈవెంట్ నిర్వహించారు ఈ స్టార్ హీరో. ఈ ఈవెంట్లో తన ఆద్వర్యంలో ప్రయోజకులు అయిన విద్యార్థులను చూసి.. ఈయన కాస్త ఎమోషనల్ అయ్యారు. అగరం ఫౌండేషన్ ద్వారా ఇప్పటి దాకా 8 వేలమంది చదువు పూర్తి చేశారు. అందరూ డిగ్రీ పట్టాలు అందుకున్నారు.ఇందులో 1800 మంది ఇంజినీర్లు ఉంటే, డాక్టర్లయిన వారి సంఖ్య 51. వీళ్లందరూ అగరం నిర్వహించిన కార్యక్రమంలో స్టేజ్ మీదికి వచ్చారు. వీరందరూ స్టేజ్ మీదికి రావడమే కాదు.. అగరం ఫౌండేషన్ తమ జీవితాలు ఎలా మలుపు తిప్పిందో చెప్పుకొచ్చారు . ఈ సందర్భంగా వీరిని చూసి హీరో సూర్య ఎమోషనల్ అయ్యాడు. వేదిక పైనే కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సూర్య పరోపకార గుణాన్ని అందరూ మెచ్చుకునేలా చేస్తోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Cryonics: మీరు చచ్చినా.. మేం చావనివ్వం..! మళ్ళీ బ్రతికిస్తాం.. కానీ..
ఇక.. 2 గంటల్లోనే హైదరాబాద్ టు విజయవాడ
ఐటీ ఉద్యోగుల్లో తీవ్ర అనారోగ్య సమస్యలు.. 84 % మందికి ఆ డిసీజ్