సీక్వెల్స్ బాట పడుతున్న సీనియర్ హీరో

Edited By: Phani CH

Updated on: Oct 25, 2025 | 12:05 PM

గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కంటే భయంకరంగా ఉంటుందని కేజియఫ్‌లో ఓ డైలాగ్ ఉంటుంది కదా.. బాలీవుడ్‌లో ఓ సీనియర్ హీరోకు ఇది పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. 20 ఏళ్లుగా హిట్ లేదు.. కొన్నేళ్లుగా సరైన సినిమా లేదు.. ఫేడవుట్ అయిపోయాడు.. అలాంటి హీరో ఒక్కసారిగా జూలు విదిల్చారు. తాజాగా వరస సీక్వెల్స్ అనౌన్స్ చేస్తున్నాడు.

ఇంతకీ ఎవరా ఫేడవుట్ సెన్సేషన్..? బాలీవుడ్ అంటే ఈ జనరేషన్‌కు కేవలం షారుక్, సల్మాన్, అమీర్, అక్షయ్ లాంటి హీరోలే గుర్తుకొస్తారు.. ఇంకాస్త లేటస్ట్ అయితే రణ్‌వీర్ సింగ్, రణ్‌బీర్ కపూర్ అంటారు.. కానీ వీళ్ళందరి కంటే ముందే ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ ఒకరున్నారు అక్కడ.. అతడే సన్నీ డియోల్. ఫేడవుట్ అయిన ఈ హీరో.. రెండేళ్లుగా మళ్లీ రచ్చ చేస్తున్నారు. గదర్ 2, జాట్ లాంటి సినిమాలతో జూలు విదిల్చారీయన. ఒక్క హిట్టు చాలు మునిగిపోయిన కెరీర్ మళ్లీ పైకి తేలడానికి..! బాలీవుడ్‌లో సన్నీ డియోల్ విషయంలోనూ ఇదే జరుగుతుంది. 20 ఏళ్ళుగా ఒక్క హిట్టు కూడా లేని ఆయనకు.. గదర్ 2తో బ్లాక్‌బస్టర్ వచ్చింది.. ఈ సినిమా ఏకంగా 600 కోట్లు వసూలు చేసింది. గోపీచంద్ మలినేని తెరకెక్కించిన జాట్ కూడా మాస్ ఆడియన్స్‌ను మెప్పించింది. ఈ సినిమాకు సీక్వెల్ కూడా ప్రకటించారు మేకర్స్. సన్నీ డియోల్ ఒకప్పుడు సూపర్ స్టార్.. మాస్‌కు కేరాఫ్ అడ్రస్ సినిమాలు.. అతడి సినిమా వస్తుందంటే బాక్సాఫీస్ భయపడిపోయేది.. అలాంటి ఫేడవుట్ అయిన ఈ స్టార్.. గదర్ 2తో బ్యాక్ టూ ఫామ్ అనిపించారు. సల్మాన్, అమీర్, అక్షయ్ సినిమాలే 100 కోట్లు దాటడానికి ముక్కీ మూలుగుతుంటే.. 20 ఏళ్ళ తర్వాత వచ్చిన ఈ సీక్వెల్ ఊర మాస్ రికార్డులు తిరగరాసింది. 80, 90ల్లో త్రిదేవ్, ఘాయల్, నరసింహ, గదర్, బోర్డర్, జీత్, విశ్వాత్మ లాంటి సినిమాలతో సన్నీ డియోల్ ప్రభంజనమే సృష్టించారు. త్వరలోనే జాట్ 2తో పాటు గదర్ 3, బోర్డర్ 2 సినిమాలు చేయబోతున్నారు సన్నీ డియోల్. ఈ సినిమాలతో పాటు లాహోర్‌ 1947, గబ్రుకు కమిటయ్యారు. రామాయణలో హనుమంతుడిగా నటిస్తున్నారు సన్నీ భాయ్.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వెంకన్నకు విరాళాల వెల్లువ..11 నెలల్లో రూ.918 కోట్లు

స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇస్తున్న 30 ప్లస్ బ్యూటీస్

Prabhas: చిన్నప్పటి నుంచి మనోడికో చెడ్డ అలవాటు ఉంది | ప్రభాస్‌తో ఎవ్వరూ చేయని సాహసం

ఓ సినిమా వాళ్లు కాసింతైనా మానవత్వంతో స్పందించండబ్బా

విక్రమ్‌ కొడుకు ఈ సారైన ఆకట్టుకుంటాడా? హిట్టా..? ఫట్టా..?