ఇప్పటి నుండే మొదలైన సమ్మర్ సినిమాల సమరం.. పోటీ మాములుగా లేదుగా
2026 సంక్రాంతి తర్వాత, తెలుగు సినిమా పరిశ్రమ దృష్టి సమ్మర్ విడుదలలపై పడింది. రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, చిరంజీవి, నాని, యష్ వంటి అగ్ర తారల చిత్రాలు వేసవి బరిలో ఉన్నాయి. పెద, ది ప్యారడైజ్, విశ్వంభర, టాక్సిక్ వంటి సినిమాలు భారీ అంచనాలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాయి.
2026 సంక్రాంతి సీజన్ ముగియడంతో, టాలీవుడ్ ప్రేక్షకులతో పాటు సినీ వర్గాల దృష్టి రాబోయే వేసవి సీజన్‌పై పడింది. మార్చి నుండి మొదలయ్యే అసలు సినిమా యుద్ధం గురించి ఇప్పటికే చర్చ మొదలైంది. 2026 సమ్మర్ లో పలు భారీ ప్రాజెక్టులు విడుదలకు సిద్ధమవుతున్నాయి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన “పెద” సినిమాను మార్చి 27న విడుదల చేయనున్నట్లు ధృవీకరించారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా సమ్మర్ రిలీజ్‌నే లక్ష్యంగా చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. సంక్రాంతి బరిలో శంకర్ వరప్రసాద్ గారు మూవీతో పోటీపడిన చిరంజీవి, ఆలస్యమైన తన “విశ్వంభర” సినిమాను వేసవిలో విడుదల చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Sandeep Reddy Vanga: ఆ సినిమాతో సందీప్ రూలింగ్‌కు చెక్ పడినట్టేనా ??
Shah Rukh Khan: షారుక్ ఖాన్ సూపర్ హిట్ మూవీ సీక్వెల్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడే
Pragathi: నన్ను చాలామంది ట్రోల్ చేశారు.. నేను నా గెలుపు తో సమాధానం చెప్పా
