గ్లోబ్‌ షేకింగ్‌.. మహేష్‌ బొమ్మ ఇంటర్నేషనల్‌

Edited By: Phani CH

Updated on: Nov 18, 2025 | 2:00 PM

రాజమౌళి-మహేష్ బాబు చిత్రం 'గ్లోబ్ ట్రాటర్' ఈవెంట్ అంగరంగ వైభవంగా జరిగింది. సినిమా టైటిల్, గ్లింప్స్ విడుదలవ్వడంతో అభిమానులు ఉత్సాహంగా ఉన్నారు. 2027లో విడుదల కానున్న ఈ గ్లోబల్ స్థాయి చిత్రం, తెలుగు సినిమాను ప్రపంచ వేదికపై నిలపనుందని ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రియాంక చోప్రా వంటి ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొని సినిమాపై అంచనాలను భారీగా పెంచారు.

వరల్డ్స్ బిగ్గెస్ట్ సూపర్‌స్టార్‌ ఆయన ప్లేస్‌కి వచ్చే వేళయింది.. అందరూ పక్కకు తప్పుకోండి అంటూ మహేష్‌ జపం చేస్తున్నారు అభిమానులు. గ్లింప్స్ తో పాటు, టైటిల్‌ని కూడా స్టేజ్‌ మీద రివీల్‌ చేస్తామని రాజమౌళి చెప్పినప్పటి నుంచి మొదలైన క్యూరియాసిటీ ఇప్పుడు మరో రూపంలో ట్రెండ్‌ అవుతోంది. ఇంతకీ సినిమా టైటిల్‌ మీకు నచ్చిందా? గ్లింప్స్ ఎలా ఉంది? అంతర్జాతీయ స్థాయిలో అంగరంగ వైభవంగా జరిగింది గ్లోబ్‌ ట్రాటర్‌ ఈవెంట్‌. పాస్‌పోర్టులు అందుకున్న ప్రతి ఒక్కరూ ఈవెంట్లో అత్యంత ఉత్సాహంగా కనిపించారు. రాజమౌళి, మహేష్‌, ప్రియాంక చోప్రా, పృథ్విరాజ్‌ సుకుమారన్‌, కీరవాణి, విజయేంద్రప్రసాద్‌, కార్తికేయతో పాటు ప్రతి ఒక్కరి స్పీచ్‌లూ ఆకట్టుకున్నాయి. 2027 సమ్మర్‌లో సినిమా రిలీజ్‌ పక్కా అనే సిగ్నల్స్ అందాయి మూవీ లవర్స్ కి. ప్రతి కేరక్టర్‌ కోసం స్పెషల్‌ బీట్స్ రిలీజ్‌ చేయడం కూడా వావ్‌ ఫ్యాక్టర్‌. రాజమౌళితో వర్కింగ్‌ ఎక్స్ పీరియన్స్ ని షేర్‌ చేసుకున్నారు నటీనటులు, సాంకేతిక నిపుణులు. మన సినిమాను గ్లోబల్‌ రేంజ్‌కి తీసుకెళ్లడమంటే ఏంటో కంప్లీట్‌గా విట్‌నెస్‌ చేశారు ఆడియన్స్. సినిమా పేరు, సినిమా గ్లింప్స్ అలా రిలీజ్‌ అయ్యాయో లేదో.. ఇలా గూస్‌బంప్స్ వచ్చేశాయంటూ సోషల్‌ మీడియాలో నిర్విరామంగా ట్రెండ్‌ చేసేశారు నెటిజన్లు. ఇది కదా మన సినిమాను గ్లోబల్‌ స్థాయికి తీసుకెళ్లడమంటే.. తెలుగు సినిమాను ప్యాన్‌ ఇండియా బాట పట్టించిన జక్కన్న.. గ్లోబ్‌ ట్రాటర్‌గా మన సినిమాను తనతో తీసుకెళ్లడం సూపర్బ్.. అదీ సూపర్‌స్టార్‌తో వెళ్లడం మార్వలెస్‌ అని మెచ్చుకుంటున్నారు జనాలు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Kamal Haasan: కథ నచ్చలేదన్న రజనీ.. లోకనాయకుడు మాత్రం అతని రాకకోసం వెయిటింగ్‌

Chiranjeevi: కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌లో చిరు.. సరికొత్త లుక్ లో మెగాస్టార్

యానిమేషన్‌ ప్రధానంగా ప్రభాస్‌ – ప్రేమ్‌రక్షిత్‌ సినిమా

హీరోల సినిమాల సంఖ్య పెరగాలంటే.. కెప్టెన్లు స్పీడు పెంచాల్సిందేనా

ధనుష్ దర్శకత్వంలో రజినీ సినిమా ??