జక్కన్నకు ఝలక్ ఇచ్చిన మహేష్ బాబు

Edited By:

Updated on: Dec 31, 2025 | 5:20 PM

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'SSMB29' షూటింగ్ మధ్యలో మహేష్ బాబు న్యూ ఇయర్ వెకేషన్‌కు వెళ్లారు. సాధారణంగా జక్కన్న సినిమాల్లో ఇది అసాధ్యం. కానీ మహేష్‌కు రాజమౌళి ప్రత్యేక అనుమతి ఇచ్చారు. గతంలోనూ ఇలాగే బ్రేక్ తీసుకున్నారు. దీంతో రాజమౌళి నియమాలను మహేష్ ఎలా బ్రేక్ చేశారనేది చర్చనీయాంశంగా మారింది. సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోందని, 2027లో విడుదల కానుందని సమాచారం.

షర్ట్ వేసుకొస్తానంటే కుదరదన్నారు.. నా స్టైల్‌లో వస్తానంటే కుదరదన్నారు అంటూ టీజర్ లాంఛ్ అప్పుడు మహేష్ బాబు చెప్తే.. అయ్యో పాపం రాజమౌళి ఎన్ని కష్టాలు పెడుతున్నాడో మా బాబును అంటూ ఫ్యాన్స్ బాగానే ఫీలైపోయారు. కానీ నేనొక్కసారి కమిటైతే నా మాట నేనే విననంటున్నారు మహేష్. మరి ఏ విషయంలో జక్కన్నకు మహేష్ ఝలక్ ఇచ్చారు..? కొన్ని నెలలుగా మహేష్ బాబుకు వారణాసి తప్ప మరో లోకం లేకుండా చేసారు రాజమౌళి. ఈ సినిమా షూటింగ్ పనుల్లోనే బిజీగా ఉన్నారీయన. అయితే ఈ ఇంటెన్స్ షెడ్యూల్ నుండి చిన్న బ్రేక్ తీసుకుని.. న్యూ ఇయర్ వేడుకల కోసం తన కుటుంబంతో కలిసి వెకేషన్‌కు బయలుదేరారు మహేష్. ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయిప్పుడు. మహేష్ బాబు వెకేషన్‌కు వెళ్లడం మామూలే.. కానీ ఇక్కడ మ్యాటర్ అది కాదు. రాజమౌళితో సినిమా చేస్తున్నపుడు ఆయన వెకేషన్ వెళ్లడమే అసలు మ్యాటర్. మామూలుగా అయితే జక్కన్న స్కూల్‌లో జాయిన్ అయ్యాక.. లోనికి రావడమే కానీ బయటికి వెళ్లడం హీరోల చేతుల్లో ఉండదు. కానీ మహేష్ మాత్రమే ఈ రూల్స్ రెండోసారి కూడా సక్సెస్ ఫుల్‌గా బ్రేక్ చేసారు. తాజాగా భార్య నమ్రత శిరోద్కర్.. పిల్లలు గౌతమ్, సితారలతో కలిసి హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో కనిపించారు మహేష్. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం ఇటలీ వెళ్తున్నట్లు తెలుస్తుంది. జనవరి ఫస్ట్ వీక్‌లో రాగానే.. మళ్లీ జక్కన్న సినిమా సెట్‌లో జాయిన్ కానున్నారు మహేష్. షూటింగ్ స్టార్ట్ అయ్యాక.. గత ఎప్రిల్‌లో కూడా వెకేషన్ వెళ్లొచ్చారు సూపర్ స్టార్. తన హీరోలకు ఇన్ని అనుమతులు ఇవ్వని రాజమౌళి.. మహేష్ బాబు విషయంలో మాత్రం పర్మిషన్ గ్రాంటెడ్ అంటున్నారు. అంతేకాదు.. మిగిలిన సినిమాలతో పోలిస్తే వారణాసి షూటింగ్ వేగంగా చేస్తున్నారు దర్శక ధీరుడు. ఈ చిత్ర షూటింగ్ 2026 సెకండాఫ్‌లోపు పూర్తి కానుంది. 2027 సమ్మర్‌కు విడుదల కానుంది ఈ చిత్రం.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వెంకటేష్‌ వచ్చేది అప్పుడే అంటూ.. చిరు ముందే లీకిచ్చిన అనిల్ రావిపూడి

కొత్త ఏడాదికి పాత సినిమాలతో వెల్ కమ్

75 దాటిన తర్వాత రజినీ ప్లాన్ మారిపోయిందా

2025లో మాయ చేసిన కొత్తమ్మాయిలు వీళ్లే

మెగా విక్టరీ సాంగ్.. థియేటర్లలో పూనకాలు ఖాయం