Srinu Viatla Tweet: భార్య వద్దా..? ఈ ముగ్గురు ఉంటే చాలా.? శ్రీను వైట్ల ట్వీట్ కు అర్థం ఏంటి..?
టాలీవుడ్లో ఒకప్పుడు స్టార్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న శ్రీనువైట్ల.. ఇప్పుడు తన కెరీర్‌లో స్ట్రగుల్ అవుతున్నారు. స్టార్ హీరోలతో సినిమాలు తీసేందుకు ట్రై చేస్తున్నారు.
టాలీవుడ్లో ఒకప్పుడు స్టార్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న శ్రీనువైట్ల.. ఇప్పుడు తన కెరీర్‌లో స్ట్రగుల్ అవుతున్నారు. స్టార్ హీరోలతో సినిమాలు తీసేందుకు ట్రై చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల తన హిట్ సినిమా ‘ఢీ’ కి సీక్వెల్ గా ‘డబుల్ ఢీ’ పేరుతో ఓ సినిమా తెరకెక్కించుకు ప్లాన్ చేశారు. తను, విష్ణు కలిసి ఈ సినిమాను గ్రాండ్‌గా అనౌన్స్ చేశారు. అయితే ఏమైందో తెలియదు కాని ఈ సినిమాను మధ్యలోనే ఆపేశారు. ఇక అటు ఫిల్మ్ కెరీర్తో పాటు.. ఇటు తన పర్సనల్ లైఫ్‌లోనూ కాస్త ఇబ్బందులు పడుతున్నారట ఈ డైరెక్టర్. తన భార్య రూప తో త్వరలో విడాకులు తీసుకుంటున్నట్టు.. ఇండస్ట్రీలోనూ…మీడియాలోనూ టాక్. అయితే ఈ విషయంపై ఇప్పటి వరకు ఎవరు స్పందించనప్పటికీ.. తాజాగా శ్రీను వైట్ల చేసిన ట్వీట్ ఒకటి.. వీరి విడాకుల విషయంలోనే కొత్త డౌట్లు క్రియేట్ చేస్తున్నాయి.రీసెంట్గా తన ముగ్గురు పిల్లలతో వెకేషన్‌కు వెళ్లిన శ్రీనువైట్ల.. తన ముగ్గురు పిల్లలతో కలిసి దిగిన ఓ ఫోటోను ట్వీట్ చేశారు. దాంతో పాటు.. జీవితం చాలా అందమైనది.. అందులోనే మనం ప్రేమించే వాళ్లు పక్కన ఉంటే.. అది మరింత అందంగా ఉంటుంది అని తన ట్వీట్లో రాసుకొచ్చారు. ఇక ఈ ట్వీట్ చూసిన నెటిజన్లు.. తన భార్య రూపతో విడిపోవడం కన్ఫర్మ్ అంటూ.. పిక్స్ అయిపోతున్నారు. మరికొంత మంది.. భార్య విడిపోయిన సరే.. తనతో తన ముగ్గురు పిల్లలు ఉంటే చాలని.. డైరెక్టర్ చెబుతున్నట్టు ఉందే ? అని నెట్టింట కామెంట్ చేస్తున్నారు. మరి కొందరేమో.. మీ ట్వీట్‌కు అర్థం ఏంటని ఆయన్నే ప్రశ్నిస్తున్నారు. క్లారిటీ కావాలంటూ.. అడుగుతున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Jathiratnam: ఓరి బుడ్డోడా.. బ్యాక్ బెంచ్ స్టూడెంట్ అనిపించినావ్‌గా.. అసలైన జాతిరత్నం..
Bus Shelter – Buffalo: బస్ షెల్టర్ ఓపెనింగ్‌కు ముఖ్య అతిథిగా గేదె.. దెబ్బకు దిగొచ్చిన అధికారులు..