రూ.500 కోట్లు వచ్చినా సేఫ్ కాదా.. ఇదెక్కడి బిజినెస్

Edited By: Phani CH

Updated on: Dec 05, 2025 | 6:04 PM

భారీ బడ్జెట్ చిత్రాలలో స్టార్ హీరోల మార్కెట్ కారణంగా అంచనా మించిన బిజినెస్ జరుగుతోంది. అయితే, ఇది కొన్నిసార్లు నిర్మాతలకు శాపంగా మారుతోంది. రూ.500 కోట్లు వసూలు చేసినా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 550 కోట్లు ఉండటం వంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. రజినీకాంత్ 'కూలీ', ప్రభాస్ 'సలార్', విజయ్ 'జన నాయగన్' వంటి చిత్రాలు ఎదుర్కొంటున్న సవాళ్లు దీనికి ఉదాహరణలు.

హీరోల మార్కెట్టే ఆ సినిమాలకు శాపంగా మారుతుందా..? వాళ్లపై జరుగుతున్న బిజినెస్సే నిర్మాతల కంటి మీద కునుకు లేకుండా చేస్తుందా..? అదేంటి అంత మాట అనేసారు.. హీరోల మార్కెట్ ఎలా నిర్మాతలను కంగారు పెడుతుంది అనుకుంటున్నారా..? ఎందుకు పెట్టదు చెప్పండి.. బ్రేక్ ఈవెనే 500 కోట్లుంటే..? అదేంటో.. ఆ బిజినెస్ మ్యాటర్ ఏంటో చూద్దామా..? బాహుబలి, పుష్ప, కేజియఫ్ లాంటి సినిమాలు సాధించిన విజయాలు చూసాక.. నిర్మాతల్లోనే కాదు బయ్యర్లలో కూడా భయం పోయింది. ఎన్ని కోట్ల బిజినెస్ చేసినా వెనక్కి వచ్చేస్తుందనే నమ్మకాన్ని కలిగించాయి ఈ మూవీస్. కానీ మరీ 500 కోట్లు వచ్చిన తర్వాత కూడా సినిమా సేఫ్ కాలేదని చెప్పుకోడానికి కాస్త విచిత్రంగా ఉంటుంది కదా..? అదే జరుగుతుందిప్పుడు. రజినీకాంత్ కూలీ సినిమానే తీసుకోండి.. దీనికి ప్రపంచ వ్యాప్తంగా 500 కోట్లు గ్రాస్ వచ్చినా సేఫ్ కాలేదు.. ఎందుకంటే దాని బ్రేక్ ఈవెన్ 550 కోట్లు ఉంది. అలాగే ప్రభాస్ హీరోగా వచ్చిన సలార్ టార్గెట్ కూడా భారీగా ఉండటంతో కొన్నిచోట్ల బ్రేక్ ఈవెన్‌కు కాస్త దగ్గరగా వచ్చి ఆగింది. తాజాగా విజయ్ చివరి సినిమా జన నాయగన్‌కు రికార్డ్ బిజినెస్ జరుగుతుంది. జన నాయగన్ విజయ్ చివరి సినిమా కావడంతో రిస్క్ తీసుకుంటున్నారు.. తమిళనాడులోనే 220 కోట్లు వస్తే గానీ సేఫ్ అవ్వదు.. అలాగే తెలుగులో 20 కోట్లు, కర్ణాటక 35 కోట్లు, కేరళ 30 కోట్లు, ఓవర్సీస్ 210 కోట్లు వరకు బిజినెస్ జరుగుతుందని అంచనా. వరల్డ్ వైడ్‌గా 500 కోట్ల టార్గెట్‌తో బరిలోకి దిగుతున్నాడు జన నాయకుడు. పొంగల్‌కు రానుంది ఈ చిత్రం. చూడాలిక ఏం జరగబోతుందో..?

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఎన్టీఆర్ సినిమాపై మైండ్ బ్లోయింగ్ అప్‌డేట్.. విషయం తెలిస్తే ఫ్యాన్స్ ఉక్కిరి బిక్కిరి అవ్వాల్సిందే

8 గంటలు పని చేయడానికి ఇదేమైనా జాబా.. ఇచ్చి పడేసిన రానా

ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే

ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ మలయాళ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా..

మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్.. నిజమైతే కనక.. హాలీవుడ్ షేకే అవ్వాల్సిందే