టాలీవుడ్ హీరోలకు బాలీవుడ్‌ షాక్‌.. అలా మైనస్ అవ్వడానికి గల కారణం ఏంటి

Edited By: Phani CH

Updated on: Oct 09, 2025 | 4:33 PM

సౌత్ హీరోలకు బాలీవుడ్ మార్కెట్‌ ఎంత ప్లస్ అవుతుందో... బాలీవుడ్ సినిమా అంతే మైనస్ అవుతోంది. ఈ జనరేషన్‌ హీరోలెవ్వరూ బాలీవుడ్ సినిమాతో సక్సెస్ అందుకోలేకపోయారు. అందుకే ఒక్క సినిమాతోనే బాలీవుడ్‌కు రామ్‌ రామ్‌ చెప్పేస్తున్నారు తెలుగు హీరోలు. రీసెంట్‌గా వార్ 2 సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. వైఆర్‌ఎఫ్ స్పై యూనివర్స్‌లో భాగంగా తెరకెక్కిన ఈ సినిమా మీద ముందు నుంచి భారీ అంచనాలు ఉన్నాయి.

కానీ ఆఫ్టర్ ఆ రిలీజ్‌ ఆ అంచనాలను అందుకోవటంలో ఫెయిల్ అయ్యింది వార్‌ 2. ఎన్టీఆర్‌ బాలీవుడ్‌ ఎంట్రీ బ్యాడ్‌ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చింది.పాన్ ఇండియా స్టార్‌గా ప్రభాస్‌కు నార్త్‌లో మంచి ఫాలోయింగ్ ఉన్నా… ప్రభాస్‌ చేసిన స్ట్రైయిట్ హిందీ సినిమా దారుణంగా నిరాశపరిచింది. ఆదిపురుష్ పేరుతో మైథలాజికల్ మూవీ చేసిన డార్లింగ్‌ కెరీర్‌లో బిగ్గెస్ట్ డిజాస్టర్‌ను ఫేస్ చేశారు. అందుకే బాలీవుడ్‌తో టచ్‌లో ఉన్నా… తన సినిమాలో సౌత్‌ ఫ్లేవరే ఎక్కువగా ఉండేలా చూసుకుంటున్నారు డార్లింగ్‌. మెగా పవర్‌ స్టార్ రామ్ చరణ్‌కు కెరీర్‌ స్టార్టింగ్‌లోనూ ఈ షాక్ తగిలింది. బాలీవుడ్‌ క్లాసిక్‌ మూవీ జంజీర్‌ను రీమేక్‌ చేసిన చరణ్‌ను ఆ సినిమా చాలా ఇబ్బంది పెట్టింది. ఫ్లాప్‌ను ఫేస్ చేయటమే కాదు… నటుడిగానూ విమర్శలు ఎదుర్కొన్నారు చెర్రీ. అందుకే ఇలాంటి ఎక్స్‌పీరియన్సెస్‌ ఫేస్ చేసిన టాలీవుడ్ స్టార్స్‌ తరువాత బాలీవుడ్‌లో స్ట్రయిట్ సినిమాలు చేసేందుకు ఇష్టపడటం లేదు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రూటు మారుస్తున్న సీనియర్ స్టార్స్‌.. కుర్ర హీరోలకు ఇక పోటీ తప్పదా ??

కుర్ర హీరోలు కనబడుటలేదు.. జాడ కోసం వెతుకుతున్న ఫ్యాన్స్..

తొక్కిసలాట ఘటనపై.. సుప్రీంకోర్టుకు విజయ్ పార్టీ

కాంతార సక్సెస్‌ ఎఫెక్ట్.. ఏకంగా రూ.12 కోట్లతో.. కోటలాంటి ఇల్లు కట్టుకున్న రిషబ్‌

గట్టిగా ఇచ్చిపడేసిన బిగ్ బాస్‌.. దెబ్బకు బిత్తర పోయిన కంటెస్టెంట్స్

Published on: Oct 09, 2025 03:10 PM