పరాశక్తి సినిమా చుట్టూ వివాదాల మంటలు వీడియో

Updated on: Jan 16, 2026 | 3:14 PM

శివకార్తికేయన్ పరాశక్తి సినిమా విడుదల ముందే రాజకీయ దుమారంలో చిక్కుకుంది. చరిత్రను వక్రీకరించి కాంగ్రెస్ ప్రతిష్టను దెబ్బతీసేలా చిత్రీకరించారని తమిళనాడు యూత్ కాంగ్రెస్ నిషేధం డిమాండ్ చేస్తోంది. 1965 హిందీ వ్యతిరేక ఉద్యమం, ఇందిరాగాంధీ, పొల్లాచ్చి ఘటనల చిత్రీకరణపై అభ్యంతరాలు వ్యక్తం చేసింది.

శివ కార్తికేయన్ నటించిన పరాశక్తి సినిమా తీవ్ర వివాదాలను ఎదుర్కొంటోంది. ఈ చిత్రంపై నిషేధం విధించాలని తమిళనాడు యూత్ కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. చరిత్రను వక్రీకరించి, భారత జాతీయ కాంగ్రెస్, దాని మాజీ నేతల ప్రతిష్టను దెబ్బతీసేలా సినిమా తీశారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా, 1965 నాటి హిందీ వ్యతిరేక ఉద్యమాల నేపథ్యంలో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ కోయంబత్తూరులో రైలు దహనాన్ని ప్రత్యక్షంగా చూసినట్లు చూపడంపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. అలాగే, పొల్లాచ్చిలో 200 మందికి పైగా తమిళుల హత్యలకు కాంగ్రెస్ పార్టీయే కారణమని సినిమాలో చూపించడం రాజకీయ ప్రేరితమైనదని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎలాంటి సాక్ష్యాలు లేకుండా తీవ్ర ఆరోపణలు చేయడం, కాంగ్రెస్ జెండాను కాల్చే సన్నివేశం చేర్చడం వెనుక దురుద్దేశం ఉందని పార్టీ మండిపడుతోంది.

మరిన్ని వీడియోల కోసం :

టాలీవుడ్ కు సెకండ్ హోమ్ గా మారుతున్న జపాన్ వీడియో

కర్మకాండకు రెడీ చేస్తుండగా.. బతికే ఉన్నానంటూ ఫోన్‌!

టాయిలెట్ వాడకం తెలిసిన వాళ్లు మాత్రమే వందే భారత్‌ ఎక్కండి!

రైలు 2 గంటలు లేటైతే అవన్నీ ఫ్రీ… IRCTC రూల్ మీకు తెలుసా?