Shraddha Kapoor: శ్రద్ధా మార్కెట్ కి ఫిదా అవుతున్న మేకర్స్
శ్రద్ధా కపూర్ 'ఈఠా' సినిమా కోసం 15 కిలోల బరువు పెరిగి తీవ్ర ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నారు. గతంలో అనుష్క శెట్టి కూడా 'సైజ్ జీరో' కోసం ఇదేవిధంగా ఇబ్బందిపడిన సంఘటనను గుర్తుచేస్తూ, కెరీర్ కోసం నటీనటులు ఇంతటి రిస్క్ తీసుకోవడం అవసరమా అని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బరువు పెరగడం, తగ్గడం వల్ల దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
సినిమాల కోసం బరువులు పెరగడం, తగ్గడం మామూలుగా చూస్తూనే ఉంటాం. కానీ కొన్నిసార్లు అవి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంటాయి. ఆ మధ్య అనుష్క చేసిన ఓ ఫీట్‌ని ఇప్పుడు శ్రద్ధాకపూర్ ప్రాక్టీస్ చేస్తున్నారు. మరీ అంత రిస్క్ అవసరమా అంటున్నారు జనాలు. ఇంతకీ అదేంటో మీ ఊహకు వచ్చే ఉంటుందిగా. శ్రద్ధాకపూర్‌కి ఇప్పుడు బాలీవుడ్‌లో చాలా స్పెషల్ ఇమేజ్ ఉంది. పక్కన పర్ఫెక్ట్ హీరో లేకపోయినా వందల కోట్లు కొల్లగొట్టిన లేడీగా ఆమెకో స్ట్రేచర్ ఉంది. దాన్ని క్యాష్ చేసుకోవడానికి ఉరుకులు పరుగులు తీయలేదు శ్రద్ధ. నిలిచి నిదానంగా సబ్జెక్టులు సెలక్ట్ చేసుకుని, వచ్చిన మార్కెట్‌ని కాపాడుకుంటున్నారు. అలా ఆమె సెలక్ట్ చేసుకున్న సినిమానే ‘ఈఠా’. మరాఠీ జానపద కళాకారిణి విఠాబాయి నారాయణ్ గావ్‌కర్ జీవితం ఆధారంగా ఈ మూవీ తెరకెక్కుతోంది. ఆ కేరక్టర్ కోసం శ్రద్ధ 15 కిలోల బరువు పెరిగారు. చీరకట్టుతో పాటు బరువైన నగలు ధరించాల్సి రావడంతో శ్రద్ధాకపూర్ సెట్లో ఇబ్బంది పడ్డారు. కాలికి కూడా గాయమైంది. వారం పాటు రెస్ట్ లో ఉన్నారు. బరువు పెరగడం, తగ్గడం మామూలు విషయం కాదు. గతంలో సైజ్ జీరో కోసం అనుష్క కూడా ఇలాగే ఇబ్బందిపడ్డారు. బరువు పెరిగి తగ్గలేక ఆరోగ్య సమస్యలు తెచ్చుకున్నారనే విషయాన్ని గుర్తుచేసుకుంటున్నారు జనాలు. కెరీర్ మంచి ఫామ్‌లో ఉన్నప్పుడు ఇలాంటి ప్రయోగాలు అవసరమా అంటున్నారు. ఇప్పటికి చేస్తే చేశారు గానీ, భవిష్యత్తులో ఆచితూచి అడుగులు వేయమంటూ సలహాలు అందుతున్నాయి శ్రద్ధాకపూర్‌కి. లేకుంటే అనుష్కలా బంగారం లాంటి కెరీర్‌ని పాడుచేసుకోవాల్సి వస్తుందని ఎగ్జాంపుల్స్ కూడా చూపిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మీ యాటిట్యూడ్‌ను మీ జేబులోనే పెట్టుకోండి.. క్యాబ్ డ్రైవర్ రూల్స్ వైరల్
ఆరు శతాబ్దాల మహావృక్షం చరిత్ర.. ఇది ఒక ఆధ్యాత్మిక అద్భుతం
ఫోన్‌లో మాటలు విన్నాడు.. మనసు గెలిచాడు
తిరుపతి మీదుగా దూసుకెళ్లనున్న బుల్లెట్ రైలు.. హైదరాబాద్ నుంచి రెండు గంటల్లోనే చెన్నైకి