తాతకు తగ్గ మనవడు !! అరుదైన ఘనత సాధించిన శోభన్ బాబు మనవడు

Updated on: May 07, 2025 | 4:10 PM

నట భూషణ శోభన్ బాబు వైవిధ్యమైన పాత్రలు, అనేక సూపర్ హిట్ సినిమాలతో తెలుగు సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేశారు. తాజాగా శోభన్ బాబు మనవడు డాక్టర్ సురక్షిత్ బత్తిన వైద్యరంగంలో ఓ అరుదైన శస్త్రచికిత్స చేసి గిన్నిస్ రికార్డు బ్రేక్ చేశారు. ఇటీవలే సురక్షిత్ బతిన చెన్నైలో ‘ట్రూ 3డీ ల్యాపరోస్కోపిక్‌' ద్వారా భారీ సిస్ట్ ఉన్న 4.5 కిలోల గర్భాశయాన్ని తొలగించారు.

2019లో డాక్టర్ సిన్హా 4.1 కిలోల గర్భాశయాన్ని ల్యాపరోస్కోపీ శస్త్ర చికిత్స ద్వారా తొలగించి.. గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డుల్లో స్థానం సాధించారు. ఇప్పుడు సురక్షిత్ ఆ రికార్డును బ్రేక్ చేశారు. 44 ఏళ్ల మహిళ గర్భాశయంలో పెద్ద సిస్ట్ ఏర్పడడంతో.. ఆమె కొంతకాలంగా విపరీతమైన నొప్పితో బాధపడుతూ ఉంది. ఎన్ని ఆస్పత్రులు సంప్రదించినా.. దానిని తొలగించడం కష్టమని, ఓపెన్ సర్జరీ తప్పా మరో మార్గం లేదని చెప్పారు. డాక్టర్ సురక్షిత్ బత్తినను సంప్రదించగా.. ఓపెన్ సర్జరీ లేకుండా.. ట్రూ 3డీ ల్యాపరోస్కోపీతో చాకచక్యంగా భారీ కణితి ఉన్న 4.5 కిలోల గర్భాశయాన్ని తొలగించారు. 8 గంటల పాటు శ్రమించి విజయవంతంగా ఈ ఆపరేషన్ పూర్తి చేశారు డాక్టార్ సురక్షిత్ బత్తిన.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

AI సాయంతో పూర్తి సినిమా తీసిన డైరెక్టర్! అవుట్ పుట్ అదిరిపోయింది

దారుణం !! తెలుగు డైరెక్టర్‌ను అవమానించిన విజయ్‌ దళపతి