Fish Venkat: చిరంజీవి ఒక్క మాటతో.. ఫిష్ వెంకట్‌కు బెస్ట్ ట్రీట్మెంట్.!
చాలా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించి మెప్పించిన నటుడు ఫిష్ వెంకట్. ఎన్నో సినిమాల్లో తన నటనతో ప్రేక్షకులను మెప్పించిన ఫిష్ వెంకట్ ఇప్పుడు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నా అంటూ.. ఓ మీడియాతో మొరపెట్టుకున్నాడు. కిడ్నీ సమస్యతో బాధపడుతున్నా అంటూ.. ఆవేదన వ్యక్తం చేశారు. సాయం కోసం ఎదురుచూస్తున్నట్టు ఈ వీడియోలో చెప్పారు. ఇక వీడియో కాస్తా వైరల్ అవడంతో.. ఫిష్ వెంకట్‌కు పరిస్థితిపై..
చాలా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించి మెప్పించిన నటుడు ఫిష్ వెంకట్. ఎన్నో సినిమాల్లో తన నటనతో ప్రేక్షకులను మెప్పించిన ఫిష్ వెంకట్ ఇప్పుడు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నా అంటూ.. ఓ మీడియాతో మొరపెట్టుకున్నాడు. కిడ్నీ సమస్యతో బాధపడుతున్నా అంటూ.. ఆవేదన వ్యక్తం చేశారు. సాయం కోసం ఎదురుచూస్తున్నట్టు ఈ వీడియోలో చెప్పారు. ఇక వీడియో కాస్తా వైరల్ అవడంతో.. ఫిష్ వెంకట్‌కు పరిస్థితిపై సినీ ప్రముఖులు రియాక్టవుతున్నారు. సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. ఇప్పుడు మెగాస్టార్ చిరు కూడా.. ఫిష్ వెంకట్ కు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. అపోలో హాస్పటల్స్‌లో ఫిష్ వెంకట్‌కు ఉచితంగా వైద్యం చేయించేలా డాక్టర్స్‌తో మాట్లాడారట చిరు.
ఇప్పటికే అపోలో ఆసుపత్రిలో ఫిష్ వెంకట్‌కు ట్రీట్మెంట్ మొదలైనట్టు తెలుస్తోంది. అంతేకాదు చిరంజీవి ఎప్పటికప్పుడు వెంకట్ ఆరోగ్య పరిస్థితిని అపోలో వైద్యులను అడిగి తెలుసుకుంటున్నారట. ఇక చిరంజీవి గతంలోనూ చాలా మంది మూవీ ఆర్టిస్ట్‌లకు సాయం చేశారు. అలాగే రీసెంట్‌గా తెలుగు రాష్ట్రాల వరదబాధితులకు 1 కోటి రూపాయిలు సాయం చేశారు మెగాస్టార్. ఫిష్ వెంకట్ త్వరగా కోలుకొని తిరిగి సినిమాల్లో నటించి మెప్పించాలని కోరుకుందాం.!
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.