సందీప్‌ కోసం.. ప్రభాస్‌ – రణ్‌బీర్‌ చేతులు కలుపుతున్నారా ??

Edited By:

Updated on: Nov 27, 2025 | 5:27 PM

సందీప్ రెడ్డి వంగా 'యూనివర్స్' సృష్టిస్తున్నారా? 'యానిమల్' రణబీర్ కపూర్, ప్రభాస్ 'స్పిరిట్' సినిమాలో గెస్ట్ అప్పియరెన్స్ ఇస్తారనే వార్తలు వైరల్ అవుతున్నాయి. పోలీస్ ప్రభాస్‌కు, యానిమల్ రణబీర్‌కు మధ్య ఎలాంటి సంబంధం ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఇది నిజమైతే, పాన్ ఇండియా స్థాయిలో ఈ కాంబినేషన్ సంచలనం సృష్టిస్తుందని సినీ అభిమానులు ఆశిస్తున్నారు.

అందరూ యూనివర్శ్‌ .. యూనివర్శ్‌.. అంటూ ఉంటే, నేను మాత్రం ఆ యూనివర్శ్‌కి దూరంగా ఎందుకు ఉండాలనే ఫీల్‌ క్రియేట్‌ అయిందా సందీప్‌ రెడ్డి వంగాలో.. అందుకే యానిమల్‌ని స్పిరిట్‌కి జత చేసి ఓన్‌ యూనివర్శ్‌కి శుభారంభం పలకబోతున్నారా? ట్రెండ్‌లో ఉన్న ఈ వార్తలో నిజం ఎంత? యానిమల్‌ సినిమాను అంత తేలిగ్గా మర్చిపోలేరు సినీ జనాలు. నార్త్, సౌత్‌ అనే తేడా లేదక్కడ. అదో కల్ట్ సినిమా అని కరడుగట్టిన విశ్లేషకులు కూడా పొగిడిన సినిమా యానిమల్‌. ఈ సినిమాలో రణ్‌బీర్‌ కేరక్టర్‌ని మరోసారి గుర్తుచేసుకుంటున్నారు జనాలు. రణ్‌బీర్‌ కేరక్టర్‌ అతి త్వరలోనే స్పిరిట్‌లో గెస్ట్ అప్పియరెన్స్ ఇస్తుందన్నది టాలీవుడ్‌ని షేక్‌ చేస్తున్న న్యూస్‌. పోలీస్‌గా ప్రభాస్‌ కనిపించే సినిమాలో, కరడుగట్టిన రణ్‌బీర్‌కి ఏం పని? వాళ్లిద్దరూ నిజంగా తలపడుతారా? లేకుంటే, ఇద్దరి మధ్యా స్నేహసంబంధాలు ఏమైనా ఉంటాయా? అంటూ రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మొన్న మొన్నటిదాకా స్పిరిట్‌లో మెగాస్టార్‌ చిరంజీవి ఉంటారనే వార్తలు వినిపించాయి. అందులో నిజం లేదని ఫుల్‌స్టాప్‌ పెట్టేశారు సందీప్‌. ఇప్పుడు రణ్‌బీర్‌ గురించి వార్తలు వైరల్‌ అవుతున్నాయి. వీటి గురించి కూడా స్పందిస్తోంది డైరక్టర్‌ కాంపౌండ్‌. క్రేజీ ప్రాజెక్టులు సెట్స్ మీదకు వచ్చిన ప్రతిసారీ ఇలాంటి వార్తలు సహజమే. వాటిని పట్టించుకోవాల్సిన పనిలేదంటోంది. లేకపోతే పోయిందిగానీ, ఒకవేళ ఉంటే మాత్రం, ఇద్దరు యంగ్‌స్టర్స్ కలిసి ప్యాన్‌ ఇండియా రేంజ్‌లో సందీప్‌ డైరక్షన్‌లో చేసే రచ్చ వేరే లెవల్లో ఉంటుందన్నది మాస్‌ ఆడియన్స్ మాట.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మీ యాటిట్యూడ్‌ను మీ జేబులోనే పెట్టుకోండి.. క్యాబ్ డ్రైవర్ రూల్స్ వైరల్

ఆరు శతాబ్దాల మహావృక్షం చరిత్ర.. ఇది ఒక ఆధ్యాత్మిక అద్భుతం

ఫోన్‌‌లో మాటలు విన్నాడు.. మనసు గెలిచాడు

తిరుపతి మీదుగా దూసుకెళ్లనున్న బుల్లెట్ రైలు.. హైదరాబాద్ నుంచి రెండు గంటల్లోనే చెన్నైకి

Andhra Pradesh: ఏపీలో స్మార్ట్‌ కార్డ్‌.. ఆధార్‌ను మించి..