Samantha: సమంత ప్లానింగ్ మామూలుగా లేదుగా..
నటి సమంత ప్రస్తుతం కెరీర్‌లో కీలక మార్పులు చేస్తున్నారు. ఆమె నటనకు దూరం అవుతున్నారనే చర్చల నడుమ, నిర్మాతగా శుభం, మా ఇంటి బంగారం చిత్రాలను నిర్మిస్తున్నారు. వెబ్ సిరీస్‌లైన రక్త్ బ్రహ్మాండ్ వంటి ప్రాజెక్టులపై దృష్టి సారించారు. వ్యక్తిగత జీవితంలోనూ బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరుతో సంబంధంపై వార్తలు వస్తున్నాయి. అయితే సింబుతో వెట్రిమారన్ సినిమాలో నటించబోతున్నారనే పుకార్లు కూడా వినిపిస్తున్నాయి.
నటి సమంత ఇకపై సినిమాల్లో కనిపించరనే చర్చ ప్రస్తుతం సినీ వర్గాల్లో జరుగుతోంది. తెలుగులో ఆమెను హీరోయిన్‌గా చూడటం కష్టమేనా? నటిగా కంటే నిర్మాతగానే బిజీగా ఉండాలని ఆమె నిర్ణయించుకున్నారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గతంలో ఏడాదికి కనీసం రెండు మూడు సినిమాలు చేసిన సమంత, రెండేళ్లుగా తెలుగు ఇండస్ట్రీతో పాటు ఏ ఇండస్ట్రీలోనూ నటించడం తగ్గించారు. ఆమె ప్రస్తుతం నటిగా నెమ్మదిస్తూ, నిర్మాతగా బిజీ అవ్వాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే సమంత తెలుగులో శుభం సినిమాతో నిర్మాతగా మారారు. సినిమాల కంటే వెబ్ సిరీస్‌ల వైపు ఎక్కువగా అడుగులు వేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మంచిర్యాల జిల్లాలో రెచ్చిపోయిన స్మగ్లర్లు
దీపిక Vs త్రిప్తీ.. గ్యాప్ ఉన్నట్టా.. లేనట్టా
కేర్ తో పాటు.. స్పీడు కూడా పెంచిన రవితేజ.. మోత మోగనున్న మాస్ జాతర
Yash: రెండేళ్లలో నాలుగు రిలీజ్‌లు.. బిగ్ స్కెచ్ రెడీ చేసిన రాకీభాయ్
టాలీవుడ్ హీరోలకు బాలీవుడ్ షాక్.. అలా మైనస్ అవ్వడానికి గల కారణం ఏంటి
