‘నేను విడాకులు తీసుకుంటే వాళ్లు సంబరాలు చేసుకున్నారు’

Updated on: Oct 24, 2025 | 7:06 PM

కొన్ని రోజుల క్రితం శుభం సినిమాతో ఆడియెన్స్ ను పలకిరించింది స్టార్ హీరోయిన్ సమంత. నిర్మాతగా ఇది ఆమెకు మొదటి సినిమా కావడం గమనార్హం. ప్రస్తుతం బాలీవుడ్ లో రక్త్ బ్రహ్మాండ్ అనే సినిమా చేస్తోంది. ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ ఫేమ్ స్టార్ డైరెక్టర్స్ రాజ్ అండ్ డీకే ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

దీంతో పాటు నందినీ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోంది సామ్. మా ఇంటి బంగారం అనే పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. సినిమాల సంగతి పక్కన పెడితే బాలీవుడ్ దర్శక నిర్మాత రాజ్ నిడుమోరుతో సామ్ ప్రేమలో ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. గతంలో ఎన్నో సందర్భాల్లో జంటగానే కనిపించారు సామ్- రాజ్. ఇటీవల కలిసే దీపావళి వేడుకలను సెలబ్రేట్ చేసుకున్నారు. అయితే తమ ప్రేమ బంధంపై అటు సామ్ కానీ, ఇటు రాజ్ కానీ నోరు విప్పడం లేదు. ఇదిలా ఉంటే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమంత తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. అలాగే విడాకులు, మయోసైటిస్ సమస్యలపైనా స్పందించింది. కెరీర్ పరంగా తాను చాలా ఒడిదొడికులను ఎదుర్కొన్నానంటూ ఆ ఇంటర్వ్యూలో చెప్పిన సమంత.. తాను కష్టాల్లో ఉన్నప్పుడు కొందరు తన పరిస్థితి చూసి సంబరాలు చేసుకున్నట్టు షాకింగ్ కామెంట్స్ చేసింది. కొందరు తన పరిస్థితి చూసి నవ్వుకున్నట్టు కూడా చెప్పుకొచ్చింది. అంతేకాదు తనకు మాయోసైటిస్ వ్యాధి వచినప్పుడు తనను ఎగతాళి చేసిన వాళ్లు కూడా ఉన్నారని కాస్త ఎమోషనల్ అయింది సామ్. అలాగే తన విడాకుల సమయంలోనూ కొందరు సంబరాలు చేసుకున్నారంటూ చెప్పుకొచ్చింది. అవన్నీ చూసినప్పుడు మనసుకు చాలా బాధేసిందని.. కానీ మెల్లమెల్లగా వాటిని పట్టించుకోవడం మానేసానంటూ చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ. అయితే ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. మరి సామ్ ను అంతగా ద్వేషించే వారు ఎవరబ్బా? అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

‘అరడజను’ పిల్లలతో సంతోషంగా ఉండు బావా !! డార్లింగ్‌కు మోహన్‌బాబు బర్త్‌డే విష్

2025 లో నాగుల చవితి ఎప్పుడు.. వివరాల కోసం ఈ వీడియో చూసేయండి

అహ్మదాబాద్ సీన్ రిపీట్.. టేకాఫ్ కాగానే.. కూలిన విమానం

అప్పుగా పెట్రోల్‌ పోయలేదని.. పొట్టు పొట్టు కొట్టిన ఖాకీ

నవంబరు 1 నుంచి బ్యాంక్‌ల కొత్త రూల్స్‌ ఇవే