దుబాయ్‌లో ఫుల్ హ్యాపీ మూడ్‌లో ఉన్న సామ్‌.. త్వరలోనే పెళ్లి

Updated on: Sep 04, 2025 | 5:35 PM

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్లలో సమంత ఒకరు. ఏమాయచేసావే మూవీతో తెరంగేట్రం చేసిన సమంత అతి తక్కువ సమయంలోనే స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగారు. లేడీ ఓరియెంటెడ్‌ సినిమాలు, వెబ్‌ సిరీస్‌, యాక్షన్‌ మూవీస్‌తో ఓ ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు. ఇటీవలే నిర్మాతగా మారిన సామ్‌.. త్వరలో మెగాఫోన్‌ పట్టనున్నారన్న వార్తలు వచ్చాయి.

ఇక సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే సామ్‌ తన సినిమాలతోపాటు పర్సనల్‌ విషయాలను కూడా షేర్‌ చేస్తుంటారు. తాజగా దుబాయ్‌లో సమంత ఫుల్‌ హ్యాపీమూడ్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. కొంతకాలంగా సమంత-రాజ్‌ నిడుమోరు జంట నెట్టింట హాట్‌ టాపిక్‌గా మారింది. ఈవెంట్లకు, ఆలయాలకు జంటగా వెళ్తున్నారు. దీంతో వీరిద్దరూ రిలేషన్‌లో ఉన్నారంటున్నాయి ఫిల్మ్ నగర్ వర్గాలు. ఇటీవలే సమంత-రాజ్‌ నిడుమోరు తిరుమల, శ్రీకాళహస్తి ఆలయాలకు కలిసి వెళ్లారు. కొద్ది రోజుల క్రతిం సమంత భుజంపై చెయ్యివేసి నడవడం, ఇంకో చోట ఇద్దరూ పక్కపక్కనే కూర్చుని హ్యాపీ మూడ్‌లో ఉన్నట్టుగా కనిపించారు. మరోసారి ఒకే కారులో ఇద్దరూ కనిపించి అభిమానులు, ఆడియన్స్‌లో మరింత ఆసక్తిని రేకెత్తించారు. తాజాగా దుబాయ్‌లో వీరిద్దరూ ఎంజాయ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. దుబాయ్‌లో జరుగుతున్న డిజైనర్‌ క్రేషా బజాజ్‌ ఫ్యాషన్‌ షో కి సమంత హాజరయ్యారు. ఆ ఫోటోలను సామ్‌ అభిమానులతో పంచుకున్నారు. దుబాయ్‌ ట్రిప్‌ను నిమిషంలో చూపిస్తున్నా అంటూ సామ్‌ షేర్‌ చేసిన వీడియోలో ఒక వ్యక్తి చెయ్యి పట్టుకొని సమంత సందడి చేసింది. ఆ వ్యక్తి కచ్చితంగా రాజ్ నే అని అభిమానులు భావిస్తున్నారు. ఈమ‌ధ్య సమంత ఇన్‌డైరెక్ట్‌గా త‌మ రిలేష‌న్ గురించి హింట్స్ ఇస్తోంద‌ని నెటిజ‌న్స్ అంటున్నారు. సామ్ – రాజ్ రిలేషన్ చాలా దూరం వెళ్లిందని, త్వరలోనే సామ్‌-రాజ్‌ రెండో పెళ్లి అంటూ జోస్యాలు చెబుతున్నారు. ప్ర‌స్తుతం స‌మంత “మా ఇంటి బంగారం” అనే చిత్రంతో పాటు, ‘రక్త బ్రహ్మాండ్: ది బ్లడీ కింగ్‌డమ్’ అనే వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారు. ఈ సిరీస్‌ను రాజ్ & డీకేలు తెరకెక్కిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వినాయకుడికి నైవేద్యంగా బంగారు ఉండ్రాళ్లు! కేజీ ఎంతో తెలుసా?