Samantha: విద్యార్ధులకు సమంత కీలక సూచన.. చదువుతోపాటు వాటిపై కూడా దృష్టి పెట్టాలి

Updated on: Oct 07, 2025 | 6:58 PM

స్టార్‌ హీరోయిన్‌ సమంత విద్యార్ధులకు కీలక సూచన చేవారు. విద్యార్ధులు ఎదుర్కొంటున్న తీవ్ర ఒత్తిడి గురించి స్పందించిన సమంత విద్యార్ధులను ఉద్దేశిస్తూ.. జీవితమంటే మార్కులు, గ్రేడులే కాదని, వాటికంటే ముఖ్యమైనవి మానవతా విలువలని అన్నారు. చదువుతో పాటు మంచి మనుషులుగా ఎదగడంపై దృష్టి పెట్టాలని సూచించారు.

ఆదివారం సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించిన సమంత, ఓ విద్యార్థి అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. చదువుతో పాటు ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి? సమయం దొరకడం లేదు అంటూ ఓ విద్యార్థి ప్రశ్నించగా, సమంత తనదైన శైలిలో సమాధానమిచ్చారు. నిజాయతీగా చెప్పాలంటే తాను విద్యార్థిగా ఉండి చాలా కాలమైందని, కానీ ప్రస్తుత విద్యార్థులు పడుతున్న ఇబ్బందుల గురించి వింటున్నానని, వారిపై ఒత్తిడి చాలా ఎక్కువగా ఉందని అన్నారు. తను స్కూల్లో చదువుకున్న రోజులు, విషయాలు ఇప్పుడు ఏవీ తనకు గుర్తులేవని, అయితే, ఆ సమయంలో తాను నేర్చుకున్న స్నేహం, దయ, సానుభూతి, ఇతరుల పట్ల గౌరవం వంటి లక్షణాలే తన జీవితంలో ఎంతగానో ఉపయోగపడ్డాయని సమంత వివరించారు. మంచి మనిషిగా ఎలా ఉండాలో తాను పాఠశాలలోనే నేర్చుకున్నానన్నారు. జీవితంలో ముందుకు సాగడానికి అవి తనకు ఎంతగానో తోడ్పడ్డాయని సామ్‌ వివరించారు. విద్యార్థులు మంచి గ్రేడులకే పరిమితం కాకుండా ఈ విలువలను అలవర్చుకోవాలని ఆమె సూచించారు. ఈ సందర్భంగా, 2023లో దేశంలో విద్యార్థుల ఆత్మహత్యలు పెరిగాయని, మహారాష్ట్రలో అత్యధిక కేసులు నమోదయ్యాయని తెలిపే ఓ వార్తా కథనాన్ని ఆమె పంచుకుని తన విచారాన్ని వ్యక్తం చేశారు. అలాగే తన తదుపరి ప్రాజెక్టుల గురించి కూడా సమంత ఓ శుభవార్త పంచుకున్నారు. చాలాకాలంగా ఎదురుచూస్తున్న తన కొత్త తెలుగు సినిమా షూటింగ్ ఈ నెలలోనే ప్రారంభం కానుందని ఆమె వెల్లడించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

భార్య వెళ్లిపోయిందని చిన్నమ్మపై పగ.. 13 ఏళ్ల తర్వాత

దూసుకుపోతున్న బంగారం ధర తులం ఎంతంటే

హైదరాబాదీలు బీ అటెన్షన్ !! ఇది వింటే మీకు పండగే

10వ తరగతి అర్హతతో రైల్వేలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

ఛాతీలోకి 7 బుల్లెట్లు.. వీరమరణం.. ‘కాంతార 2’ హీరోయిన్ తండ్రి ఎవరో తెలుసా ??