Samantha: సమంత ‘యాంటీ ఇన్‌ఫ్లమేటరీ’ పై.. సోషల్ మీడియాలో చర్చ

Updated on: Mar 01, 2026 | 12:51 PM

మయోసైటిస్ వ్యాధితో పోరాడుతున్న సమంత తన ఆరోగ్య రహస్యాలను పంచుకుంది. ఆమె క్రమశిక్షణతో కూడిన యాంటీ ఇన్‌ఫ్లమేటరీ డైట్, ఉదయం ధ్యానం, ప్రార్థన, సూర్యరశ్మితో కూడిన దినచర్యను పాటిస్తోంది. కేవలం బరువు తగ్గడం కాదు, సంపూర్ణ ఆరోగ్యం కోసమే ఈ జీవనశైలిని ఎంచుకున్నానని సమంత తెలిపింది. ఆమె రికవరీకి ఈ పద్ధతులు ఎంతగానో సహాయపడ్డాయి.

సినిమాల్లో సూపర్ స్టార్‌గా బిజీగా ఉన్న దశలోనే తన శరీరంలో వచ్చిన మార్పులతో ఒక్క సారిగా షాక్‌ అయింది సమంత. తనకు వచ్చింది రేర్ డిసీజ్‌ అని.. అది తన దేహంలో ఉన్న కండరాలను క్షీణించేలా చేస్తుందని తెలుసుకుని ఢీలా పడింది.కానీ కృంగిపోలేదు.. షార్ట్‌ గ్యాప్‌లోనే తనకొచ్చిన మయోసైటిస్ వ్యాధిపై పోరాటం మొదలెట్టింది. మొక్కవోని విశ్వాసంతో.. ట్రీట్మెంట్, డైట్, వర్కవుట్స్‌తో బౌన్స్ బ్యాక్ అయింది. మళ్లీ క్రమంలోనే తన దినచర్య గురించి డైట్ గురించి.. ఓ ఇంటర్వ్యూలో వివరించింది ఈ బ్యూటీ. దీంతో ఆమె డైట్‌ కాస్తా ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. ప్రముఖ ఇంటర్నేషనల్ మ్యాగజీన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సమంత తన రోజువారీ దినచర్య గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ప్రతిరోజూ ఉదయాన్నే నిద్రలేవడం ఆమెకు అలవాటు. మేల్కొన్న తర్వాత కొద్దిసేపు ప్రార్థనలు చేసుకుని, బయట ప్రకృతిలో సూర్యరశ్మి తగిలేలా కాసేపు గడుపుతుంది. ఆ తర్వాత ధ్యానం చేస్తుంది. ఈ ప్రక్రియ కోసం ఆమె సుమారు ఒకటిన్నర గంటల సమయం కేటాయిస్తుంది. ఈ ‘మీ టైమ్’ కాన్సెప్ట్‌ తనను మానసికంగా దృఢంగా ఉంచుతుందని సమంత నమ్ముతోంది. అంతేకాదు సామ్ తన డైట్ గురించి కూడా చెప్పుకొచ్చింది. దాదాపు ఒక సంవత్సరం పాటు తాను ప్రతిరోజూ ఒకే రకమైన కూరగాయలు, చికెన్ వంటకాలను మాత్రమే తిన్నానని చెప్పుకొచ్చింది. మయోసైటిస్ సమస్య ఉన్నప్పుడు కొన్ని ఆహార పదార్థాలు శరీరంలో మంటను పెంచుతాయని.. అందుకే ఎటువంటి రిస్క్ తీసుకోకుండా తన శరీరాన్ని హీలింగ్ చేసుకోవడమే లక్ష్యంగా ఓకే రకమైన ఫుడ్ తీసుకున్నట్టు సమంత చెప్పింది. ఇక ప్రముఖ పోషకాహార నిపుణుడు రయాన్ ఫెర్నాండోతో జరిగిన సంభాషణలో.. సమంత మరిన్ని వివరాలు పంచుకుంది. తాను ప్రస్తుతం ‘యాంటీ ఇన్‌ఫ్లమేటరీ’ డైట్‌ను అనుసరిస్తున్నట్టు చెప్పుకొచ్చింది. చిన్నతనంలో తాను ఏది తిన్నా బరువు పెరిగేదాన్ని కాదని.. , అందుకే ఆహారం విషయంలో అశ్రద్ధగా ఉండేదాన్నంటూ చెప్పుకొచ్చింది. కానీ ఇప్పుడు ఆరోగ్యం అంటే కేవలం బరువు తగ్గడం కాదనే విషయం తనకు తెలిసిందని.. అందుకే తన శరీరం ధర్మాన్ని.. అర్థం చేసుకుని తన డైట్‌లో మార్పులు చేసుకున్నట్టు చెప్పుకొచ్చింది సామ్.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నాన్న లేకే ఇన్ని కష్టాలు! కానిస్టేబుల్ దివ్య సూసైడ్ నోట్ కలకలం!

Europe Trip: తక్కువ ఖర్చుతో యూరప్ ఎలా చుట్టేయాలి? కంప్లీట్ ట్రావెల్ గైడ్

ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు.. మొదలైన యుద్ధం

రైల్వే పరీక్షా తేదీలు మార్పు.. కొత్త షెడ్యూల్ ఇదే

రూ. 60 వేల విలువైన కెమెరా ఆర్డర్ పెడితే.. ఆన్‌లైన్ మోసం..

Follow Us