ఒక్కటైన సమంత, రాజ్ నిడమోరు.. పెళ్లి వీడియో
సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన రూమర్స్ నిజమయ్యాయి. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, డైరెక్టర్ రాజ్ నిడిమోరును రెండో వివాహం చేసుకున్నారు. కోయంబత్తూర్‌లోని ఈషా ఫౌండేషన్ ఆలయంలో అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి పెళ్లి జరిగినట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా డేటింగ్ వార్తలకు ఈ వివాహంతో స్పష్టత వచ్చింది.
సోషల్ మీడియాలో వినిపిస్తున్న రూమర్స్ నిజమయ్యాయి. గత రెండు రోజులుగా నెట్టింట చక్కర్లు కొట్టిన వార్తలకు ఎట్టకేలకు చెక్ పడింది. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రెండో పెళ్లి చేసుకున్నారు. కొంతకాలంగా డేటింగ్ చేస్తున్న డైరెక్టర్ రాజ్ నిడిమోరును ఆమె వివాహం చేసుకున్నారు. వీరిద్దరు పెళ్లి వేడుక కోయంబత్తూర్ లోని ఈషా ఫౌండేషన్ లోని లింగ భైరవి ఆలయంలో సోమవారం తెల్లవారుజామున జరిగినట్లు తెలుస్తోంది. వీరిద్దరి పెళ్లి వేడుకకు దాదాపు 30 మంది అతిథులు హాజరయ్యారని సమాచారం. తన పెళ్లికి సామ్ ఎరుపు రంగు చీర ధరించినట్లుగా టాక్. గత రెండు రోజులుగా సమంత, రాజ్ నిడమోరు పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలోనే రాజ్ నిడమోరు మాజీ భార్య శ్యామలి చేసిన ఇన్ స్టా పోస్ట్ సైతం ఈ వార్తలకు బలం చేకూర్చింది. “తెగించిన వ్యక్తులే ఇలాంటి పనులు చేస్తారని” ఆమె పోస్ట్ చేశారు. కొంతకాలంగా సమంత, రాజ్ నిడిమోరు డేటింగ్‌లో ఉన్నారని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’, ‘సిటాడెల్’ వంటి సిరీస్‌లకు కలిసి పనిచేయడంతో వీరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. సమంతకు సద్గురు జగ్గీ వాసుదేవ్‌పై ఉన్న గురుభావం, ఈశా ఫౌండేషన్‌తో ఉన్న అనుబంధం కారణంగానే అక్కడ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. సమంత, బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరు డేటింగ్‌లో ఉన్నట్లు కొంతకాలంగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వీరిద్దరూ కలిసి ఉన్న పోస్ట్‌లను సమంత ఇటీవల పంచుకోవడంతో ఆ వార్తలకు మరింత బలం చేకూరింది. అయితే, ఈ పెళ్లి వార్తలపై సమంత గానీ, రాజ్ నిడిమోరు గానీ ఇంతవరకు అధికారికంగా స్పందించలేదు. అయితే,ఇదంతా కేవలం సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారమేనా? లేక నిజంగానే వివాహం జరగనుందా? అని అభిమానులు కన్‌ఫ్యూజన్‌లో ఉండగానే.. ఈ ఇద్దరూ ఒక్కటై రూమర్స్‌కి చెక్‌పెట్టారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గ్యాస్ సిలిండర్ నుండి పాన్ కార్డ్ వరకు డిసెంబరులో జరిగే మార్పులు ఇవే
భక్తులతో కిక్కిరిసిన శబరిమల..12 రోజుల్లో 10 లక్షలమంది..
రూ. 10 కోట్లకు విల్లా.. హైదరాబాద్‌లో భారీ డిమాండ్
నిచ్చెన ఎక్కితేనే బ్యాంకు సేవలు.. డబ్బులు వేయాలన్నా, తీయాలన్నా రిస్క్ చేస్తేనే
పెరుగుతున్న డయాబెటిస్ కేసులు.. స్కిన్ క్రీమ్ రూపంలో ఇన్సులిన్
