సమంత,రాజ్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ వీడియో
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఇటీవల తన వ్యక్తిగత జీవితంతో పాటు ప్రొఫెషనల్ కెరీర్‌లోనూ కొత్త అధ్యాయాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. గతేడాది ఆమె ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరుతో వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. కోయంబత్తూరులోని ఈషా యోగా సెంటర్‌లో లింగ భైరవి ఆలయం సన్నిధిలో, అత్యంత సింపుల్‌గా ఈ వివాహం జరగడం అప్పట్లో హాట్ టాపిక్‌గా మారింది. కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే హాజరైన ఈ పెళ్లి, సమంత తీసుకున్న స్పిరిచువల్ నిర్ణయానికి ప్రతీకగా నిలిచింది. పెళ్లి తర్వాత తొలి న్యూ ఇయర్‌ను సమంత–రాజ్ జంట ప్రత్యేకంగా జరుపుకుంది.
వివాహం తర్వాత వచ్చిన నూతన సంవత్సరానికి స్వాగతం పలికేందుకు సామ్-రాజ్ పోర్చుగల్ రాజధాని లిస్బన్‌కు వెళ్లారు. అక్కడ వారి వెకేషన్‌కు సంబంధించిన ఫోటోలు, వీడియోలను సమంత సోషల్ మీడియాలో పంచుకున్నారు. అవి నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా న్యూ ఇయర్ సెలబ్రేషన్‌కు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఆ వీడియోలో సమంత ఎంతో ఆనందంగా, నవ్వుతూ కనిపిప్తోంది. భర్త రాజ్‌తో కలిసి న్యూ ఇయర్‌కి గ్రాండ్‌గా వెల్‌కమ్ చెప్పిన తీరుకు అభిమానులు ఫిదా అవుతున్నారు. ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ..సామ్ ఇలా హ్యాపీగా ఉండటం చూసి చాలా ఆనందంగా ఉందంటూ కామెంట్స్ చేస్తూ, సామ్ జంటకు న్యూ ఇయర్ విషెస్ చెబుతున్నారు. పెళ్లి తర్వాత సమంత జీవితంలో వచ్చిన పాజిటివ్ చేంజ్ స్పష్టంగా కనిపిస్తోందని చాలామంది అభిప్రాయపడుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం :
