‘నాన్నా నువ్వు చనిపోతావా..’ కొడుకు మాటలకు కన్నీళ్లు పెట్టుకున్న సైఫ్

Updated on: Feb 12, 2025 | 4:28 PM

పసితనం..! అమ్మా నాన్నలు చూపించే ప్రేమను చూసి మురిసిపోయే పసితనం! చుట్టూ ఉన్న పరిస్థితులేం పట్టని పసితనం! అలాంటి పసితనంతోనే సైఫ్ అలీ ఖాన్ కొడుకు కూడా తన తండ్రిని ఏడిపించాడు. ఓ పక్క గాయంతో బాధపడుతున్నా.. ఆ గాయం నుంచి నెత్తురు కారుతున్నా.. తన బిడ్డను.. ఆ బిడ్డ నోటి నుంచి వచ్చిన పసితనపు మాటలు తలుచుకుని కన్నీళ్లు పెట్టుకున్నాడు.

ఇప్పుడా మాటలతో నెట్టింట అందర్నీ ఎమోషన్ల అయ్యేలా కూడా చేస్తున్నాడు. ఇక గాయాల నుంచి కోలుకున్న సైఫ్ అలీఖాన్ తాజాగా నేషనల్ మీడియాతో మాట్లాడాడు. మరోసారి తనపై దాడి జరిగిన క్రమాన్ని వివరిస్తూనే.. గాయంతో ఉన్న తనను చూసి.. తన కొడుకు పలికిన కొన్ని మాటల గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యాడు. తన పై దాడి చేసిన వ్యక్తిని క్షమించాలని తన కొడుకు తైమూర్ భావిస్తున్నట్టు సైఫ్ చెప్పాడు. దొంగ తనపై దాడి చేయడంతో.. వీపులో గాయమైందని.. ఆ గాయాన్ని చూసిన కరీనా ఎంతో కంగారు పడిందని చెప్పిన సైఫ్.. అప్పుడే తన కొడుకు తైమూర్ తన దగ్గరకు వచ్చి ‘నాన్న.. నువ్వు చనిపోతావా ? అని అడిగాడంటూ ఎమోషనల్ అయ్యాడు. అలా ఏం జరగదని చెప్పిన తాను.. ఆ తర్వాత తన కొడుకును ఆసుపత్రికి తీసుకెళ్లానని చెప్పాడు. తనకు ఏమైనా జరిగితే ఆ సమయంలో తన కుమారుడు తన పక్కనే ఉండాలని కోరుకున్నానని అందుకే అలా చేశానంటూ కళ్లల్లో నీళ్లు తెచ్చుకున్నాడు సైఫ్.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సాయి పల్లవిని చూసి ఆశ్చర్యపోయిన నాగ్.. ఆకాశానికెత్తుతూ ట్వీట్!