తరచూ లైమ్‌లైట్‌లో నిలవడం కోసం అక్కడి నటీనటులు పీఆర్ ఏజెన్సీలతో ఒప్పందాలు కుదుర్చుకుంటారని చెప్పారు. తాను బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన సమయంలో ఒక వ్యక్తి తనకు ఫోన్ చేసి.. దీనిగురించే అడిగారని అమరన్ ప్రమోషన్స్‌లో సాయిపల్లవి తెలిపారు. బాలీవుడ్‌కు చెందిన ఒక వ్యక్తి ఇటీవల నాకు ఫోన్ చేశారు. నన్ను నేను ప్రమోట్ చేసుకోవడానికి.. తరచూ వార్తల్లో నిలవడం కోసం పీఆర్ టీమ్‌ను నియమించుకుంటారా? అని అడిగాడు. అలా చేస్తే నేను లైమ్‌లైట్‌లో ఉండగలను. ప్రేక్షకులు తరచూ నా గురించి మాట్లాడుకుంటారు. దానివల్ల నాకు ఎలాంటి ఉపయోగం లేదనిపించింది. ఎందుకంటే, తరచూ నా గురించి మాట్లాడాలన్నా ప్రేక్షకులకు విసుగు వస్తుంది. అందుకే నాకు అలాంటిది ఏమీ అవసరం లేదని చెప్పా అని సాయిపల్లవి తెలిపారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. బాలీవుడ్ సెలబ్రిటీలు తరచూ వార్తల్లో ఉండటానికి కారణం పీఆర్ బృందాలేనని పలువురు భావిస్తున్నారు. ఈమేరకు కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నవంబర్ 2024లో బ్యాంక్ సెలవులు.. దాదాపు సగం రోజులు తాళాలే !!
కొన్ని గంటల్లో పెళ్లి.. వరుడికి ఊహించని ట్విస్ట్ ఇచ్చిన వధువు