ఇది మామూలు పూల చొక్కా కాదు.. రేట్‌ తెలిస్తే.. గుండె జారుతుంది

Updated on: Apr 20, 2025 | 6:54 PM

మన స్టార్ హీరోలు.. బయట చూడ్డానికి చాలా సింపుల్ గా ఉంటారు. క్యాజువల్‌ లుక్‌ మెయిన్‌ టేన్ చేస్తుంటారు. కూల్‌గా ఉన్నామన్న ఫీల్.. తమను చూస్తున్న వారికి కలిగిస్తుంటారు. కానీ కాస్త డీప్‌గా చూస్తే.. మనందరికీ దిమ్మతిరిగే పోయే విషయం తెలుస్తుంది. వాళ్లు కూల్‌ కాదు.. వెరీ హాట్ అని! వాళ్లు క్యాజువల్‌ కాదు.. కాస్ట్లీ అని..! వాళ్లు సింపుల్ కాదు.. రిచ్‌ ఫ్యాషన్ సెన్స్‌ ఉన్నవాళ్లని!

ఇప్పుడు ఎన్టీఆర్‌ దుబాయ్‌ లుక్‌ కూడా ఇదే డైలాగ్స్‌ను మనకు గుర్తు తెస్తోంది. యంగ్ టైగర్ ధరించిన జస్ట్ క్యాజువల్ షర్టే.. దాని వర్జినల్ ప్రైజ్‌తో అందర్నీ నోరెళ్ల బెట్టేలా చేస్తోంది. ఇక ఎట్ ప్రజెంట్ ప్రశాంత్ నీల్తో చేయబోయే డ్రాగన్ సినిమా కోసం.. రెడీ అవుతున్న తారక్‌… ఆ సినిమా షూటింగ్‌లో జాయిన్‌ కాకముందే తన ఫ్యామిలీతో చిన్న వెకేషన్ ప్లాన్ చేశాడు. అందుకోసం దుబాయ్‌ను సెలక్ట్ చేసుకున్నాడు. సైలెంట్‌గా… తన ఇద్దరు కొడుకులు, తన భార్యతో కలిసి దుబాయ్ వెళ్లాడు. అక్కడ ల్యాండ్‌ అయ్యాక.. తనను కలిసేందుకు వచ్చిన ఫ్యాన్స్‌కు ఫోటో ఇచ్చాడు. ఆ ఫోటోతో.. ఆ ఫోటోలోని తన లుక్‌తో నెట్టింట వైరల్ అయ్యాడు. అయితే ఆ ఫోటోను చూసిన చాలా మంది, అందులో తారక్‌ లుక్‌ను.. ఆయన వేసుకున్న షర్ట్‌ ను డీ కోడ్ చేశారు. అది ఏ బ్రాండ్‌కు చెందిన షర్ట్‌ .. దాని ధర ఎంత అనే విషయాలను గూగుల్లో వెతికి తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే ఆ షర్ట్ రేట్ చూసి షాకయ్యారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Naga Chaitanya: చైతూకు ఇంకో తమ్ముడు ఉన్నాడా ??

బోర్డు తిప్పేసి.. సరికొత్తగా జనాల్లోకి పచ్చళ్ల సిస్టర్స్

దేవుళ్లతో కామెడీలొద్దు.. ఇచ్చిపడేస్తారు…