RRR: అనుమానాలన్నీ పటాపంచలు చేస్తూ RRR వచ్చేస్తోంది! వీడియో

|

Oct 06, 2021 | 9:25 AM

RRR సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని అశేష సినీ అభిమానులు ఎదురుచూస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుండడం.

RRR సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని అశేష సినీ అభిమానులు ఎదురుచూస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుండడం.. రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌ వంటి స్టార్‌ హీరోలు కలిసి నటిస్తుండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన టీజర్లు, దోస్తీ పాటకు భారీ స్పందన వచ్చింది. ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభమై దాదాపు మూడేళ్లు గడుస్తోంది. దీంతో సినిమా రిలీజ్‌ కోసం ఫ్యాన్స్‌ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నిజానికి ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా కరోనా కారణంగా సినిమా చిత్రీకరణ ఆగిపోయింది. ముందుగా ఈ సినిమా దసరా కానుకగా విడుదల చేస్తారనే వార్తలు వచ్చాయి. అయితే వాయిదా వేస్తూ చిత్ర యూనిట్‌ నిర్ణయం తీసుకుంది

 

మరిన్ని ఇక్కడ చూడండి: MAA Elections 2021: ప్రకాష్ రాజ్ వెనుక పవన్ కళ్యాణ్ ఉన్నారా? లైవ్ వీడియోViral Video: ఈ బిస్కెట్‌ తినకపోతే పిల్లలకు కీడు.. వీడియో

Published on: Oct 06, 2021 09:24 AM