కాంతార2 టీంలో వరుస మరణాలు.. విషాదంలో మూవీ యూనిట్

Updated on: Jun 13, 2025 | 5:12 PM

రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో నటిస్తోన్న కాంతార: చాప్టర్ 1 సినిమా తరచూ వార్తల్లో నిలుస్తోంది. ఈ సినిమాలో నటిస్తోన్న ఆర్టిస్టులు ఒక్కొక్కరుగా చనిపోతుండటం కన్నడ సినిమా ఇండస్ట్రీలో తీవ్ర చర్చనీయాంశమవుతోంది. కొన్ని రోజుల క్రితం కేరళ కు చెందిన జూనియర్ ఆర్టిస్ట్ కపిల్ ప్రమాదవశాత్తూ నదిలో పడి చనిపోయాడు.

ఆ తర్వాత కొన్ని రోజులకు ఇదే సినిమాలో నటిస్తోన్న రాకేష్ పూజారి గుండెపోటుతో కన్ను మూశాడు. ఇప్పుడు ఈ సినిమాలో నటిస్తోన్న మరో జూనియర్ ఆర్టిస్ట్ తుది శ్వాస విడిచారు. ఇదే న్యూస్ ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ అవుతోంది. కేరళలోని త్రిసూర్ కు చెందిన జూనియర్ ఆర్టిస్ట్ విజు వికె జూన్ 11 అర్ధరాత్రి గుండె నొప్పితో కుప్పకూలాడు. ఇలా కొన్ని నెలల వ్యవధిలో కాంతార 2 సినిమాలో భాగమైన ముగ్గురు ఆర్టిస్టులు కన్నుమూయడం శాండల్ వుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. త్రిసూర్ లో నివాసముండే విజు వికే ‘కాంతార: చాప్టర్ 1’ సినిమా షూటింగ్ కోసం కర్ణాటకకు వచ్చారు. అగుంబే సమీపంలోని హోమ్ స్టేలో ఆయన బస చేశారు. అయితే బుధవారం రాత్రి ఆయనకు ఛాతీ నొప్పి వచ్చింది. వెంటనే ఆయనను తీర్థహళ్లిలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయాన్ని విజు కుటుంబ సభ్యులకు చేరవేయగా వారు వెంటనే కర్ణాటకకు బయలు దేరారు. గతంలో, ‘కాంతార: చాప్టర్ 1’ సినిమాలో జూనియర్ ఆర్టిస్ట్ అయిన కపిల్ మరణించాడు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సాయంత్రం చిరుతిండికి బ‌దులు వీటిని తింటే.. ఎన్నో లాభాలు

చెత్త మధ్యన ఉన్నది ఏదో సాధారణ శిల్పం అనుకుంటే పొరపాటే

Published on: Jun 13, 2025 05:11 PM