రచ్చకెక్కిన రివ్యూలు, రేటింగ్ ల వ్యవహారం
తెలుగు సినిమా ప్రపంచంలో రివ్యూల వ్యవహారం రచ్చకెక్కింది. నిర్మాత రాజేష్ దండా, తెలుగు 360 వంటి వెబ్‌సైట్‌లు డబ్బులు వసూలు చేస్తూ రివ్యూలు ఇస్తున్నాయని ఆరోపించారు. పాజిటివ్ రివ్యూలకు పైకం చెల్లించకుంటే నెగెటివ్ కంటెంట్ పెడుతున్నాయని, ఇది తన ఒక్కడి సమస్య కాదని, మొత్తం పరిశ్రమ సమస్య అని తెలిపారు. ఈ ‘రివ్యూ మాఫియా’పై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్మాతలు డిమాండ్ చేస్తున్నారు.
తెలుగు సినిమా పరిశ్రమలో రివ్యూలు, రేటింగ్‌ల వ్యవహారం తీవ్ర వివాదానికి దారి తీసింది. నిర్మాత రాజేష్ దండా, తెలుగు 360 వంటి వెబ్‌సైట్‌లు డబ్బులు వసూలు చేస్తూ సినిమా రివ్యూలను ప్రభావితం చేస్తున్నాయని బహిరంగంగా ఆరోపించారు. నిజాలు బయటపెడతానంటూ రాజేష్ దండా, తెలుగు 360 వెబ్‌సైట్ బాగోతాన్ని బట్టలిప్పి నిలబెట్టారని టీవీ9 నివేదించింది. రివ్యూల పేరుతో దోపిడీ దందా చేస్తున్నారని, సినిమా విజయవంతం కావాలంటే నిర్దిష్ట ప్యాకేజీలు చెల్లించాలని వెబ్‌సైట్‌లు డిమాండ్ చేస్తున్నాయని ఆయన తెలిపారు. డబ్బులు చెల్లించకపోతే నెగెటివ్ రివ్యూలు, ట్వీట్లు ప్రచురించి సినిమాను దెబ్బతీస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో నాగవంశీ, దిల్ రాజు వంటి నిర్మాతలు కూడా ఇలాంటి అనుభవాలనే ఎదుర్కొన్నారని, ఇది తన ఒక్కడి సమస్య కాదని, మొత్తం సినీ పరిశ్రమ సమస్య అని రాజేష్ దండా పేర్కొన్నారు. ఈ ‘రివ్యూ మాఫియా’పై ఇండస్ట్రీ మొత్తం ఒక్కటై సోషల్ మీడియాలో నిరసన తెలియజేస్తోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
30ల్లోకి రాకముందే సీనియర్లు అయ్యారుగా
OG నా సినిమాకు కాపీ.. ఆ దర్శకుడి సంచలన ఆరోపణ
ఎన్టీఆర్ – నీల్ సినిమా ఆగిపోయిందా ??