Renu Desai: మరో జన్మ వరకు ఎందుకు ?? ఈ జన్మలోనే అన్నీ క్లియర్ చేస్తా

Updated on: Jan 25, 2026 | 8:28 PM

నటి రేణూ దేశాయ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత, వృత్తి జీవితంపై ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. పునర్జన్మ, మోక్షం గురించి మాట్లాడుతూ, తనకు మరో జన్మ వద్దని, ఈ జన్మలోనే మోక్షం లభిస్తుందని నమ్ముతున్నట్లు తెలిపారు. అన్ని కర్మలు, రుణానుబంధాలను ఈ జన్మలోనే తీర్చుకోవాలని, ఎవరికీ ఎలాంటి లెక్కలు మిగల్చకూడదని ఆమె స్పష్టం చేశారు. జీవితం అన్‌ప్రెడిక్టబుల్ అని చెబుతూ, ఈ జన్మలోనే అన్నింటినీ పరిష్కరించుకోవాలనే ఆమె తత్త్వం ఆలోచింపజేస్తుంది.

రేణూ దేశాయ్! ఒకప్పుడు హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించి తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారీమె. ఆ తర్వాత దర్శకురాలిగా, నిర్మాతగానూ, కాస్ట్యూమ్ డిజైనర్‌గానూ కూడా ఆకట్టుకున్నారు. తన మల్టీ ట్యాలెంట్‌తో తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. అయితే పెళ్లి, పిల్లల తర్వాత చాలా ఏళ్ల పాటు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉండిపోయిన రేణు.. ఈ మధ్యన టైగర్ నాగేశ్వరరావు సినిమాలో ఓ స్పెషల్ రోల్ చేశారు. ఆ సినిమాతో రీఎంట్రీ ఇచ్చారు. అయితే ఆ సినిమా రిజెల్ట్‌ తో సినిమాలకు మళ్లీ షాట్ బ్రేక్ ఇచ్చిన ఈమె.. సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటూ వస్తున్నారు. పలు సామిజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. పలు వేదికలపైన మహిళలు, మూగజీవాల సమస్యలపై తన గళాన్ని వినిపిస్తుంటారు. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూకు వెళ్లిన రేణు దేశాయ్‌.. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ క్రమంలోనే మోక్షం, పునర్జన్మ గురించి మాట్లాడుతూ.. షాకింగ్ కామెంట్స్ చేశారు. మరో లైఫ్, మరో జన్మంటూ ఉంటే ఏం చేద్దామనుకుంటున్నారు? అని ఓ ఇంటర్వ్యూయర్ .. రేణు దేశాయ్‌ను అడగగా.. అమ్మో.. నాకు మరో జన్మ వద్దంటూ షాకింగ్ ఆన్సర్ ఇచ్చారు.అంతేకాదు ఈ జన్మలోనే తనకు మోక్షం లభిస్తుందని.. ఈ విషయంలో తాను క్లియర్‌గా ఉన్నానంటూ చెప్పుకొచ్చింది. అంతేకాదు ఈ జన్మలో ఉన్న అన్ని కర్మలు, అన్ని రుణానుబంధాలను తాను సెట్ చేసుకుంటున్నట్టు రేణూ దేశాయ్‌ చెప్పుకొచ్చారు. ఎవరికైనా.. ఏదైనా ఇవ్వాల్సి ఉంటే రుణం లేకుండా తిరిగి ఇచ్చాస్తానన్నారు. అలాగే తనకు రావాల్సి ఉంటే తీసుకుంటానంటూ చెప్పుకొచ్చారు. ఎవరినైనా తాను హర్ట్ చేసినా.. అలాగే తాను కూడా ఎవరి చేతనైన బాధింపబడినా.. అది ఎలాంటి లెక్కలైనా సరే.. ఈ జన్మలోనే తేల్చేసుకుంటానంటూ రేణు చెప్పుకొచ్చారు. తాను ఏ క్షణంలోనైనా చనిపోవచ్చని.. మాట్లాడుతుండగానే హార్ట్ అటాక్ వచ్చి పోవచ్చని.. లైఫ్ అన్‌ ప్రెడిక్టబుల్ అంటూ చెప్పుకొచ్చారు రేణూ దేశాయ్.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Mega158: ‘జన నాయగన్‌’ ఎఫెక్ట్.. చిక్కుల్లో చిరు నెక్స్ట్‌ మూవీ ??

రాజా సాబ్ ప్రతిష్ఠను దెబ్బతీస్తున్నారంటూ.. సైబర్‌ పోలీసులకు SKN ఫిర్యాదు

Anil Ravipudi: అసాధ్యుడువయ్యా… అర్థ రూపాయితో పది రూపాయలు కొట్టేశావ్‌ మరి

‘పాటల రచయితపై చెప్పు విసిరిన మహిళ..’కట్ చేస్తే షాకింగ్ నిజం

TOP 9 ET: రోజు రూ.25 లక్షలు ఖర్చు చేస్తున్న చిరు!