నాగార్జున స్టేట్‌మెంటు రికార్డు.. కొత్త క్రిమినల్‌ చట్టాల ప్రకారం వాట్‌ నెక్ట్స్‌ !!

|

Oct 09, 2024 | 9:28 AM

మంత్రి కొండా సురేఖపై సినీ హీరో అక్కినేని నాగార్జున దాఖలు చేసిన పిటిషన్‌పై నాంపల్లి కోర్టు విచారణ చేపట్టింది. పిటిషన్‌ ఎందుకు ఫైల్ చేశారని నాగార్జునను ప్రశ్నించింది నాంపల్లి కోర్ట్‌. మంత్రి కొండా సురేఖ తన కుటుంబంపై అమర్యాదపూర్వక వ్యాఖ్యలు చేశారని నాగార్జున వివరణ ఇచ్చారు. మంత్రి హోదాలో ఉండి నాగచైతన్య -సమంత విడాకులపై కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేశారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

మంత్రి కొండా సురేఖపై సినీ హీరో అక్కినేని నాగార్జున దాఖలు చేసిన పిటిషన్‌పై నాంపల్లి కోర్టు విచారణ చేపట్టింది. పిటిషన్‌ ఎందుకు ఫైల్ చేశారని నాగార్జునను ప్రశ్నించింది నాంపల్లి కోర్ట్‌. మంత్రి కొండా సురేఖ తన కుటుంబంపై అమర్యాదపూర్వక వ్యాఖ్యలు చేశారని నాగార్జున వివరణ ఇచ్చారు. మంత్రి హోదాలో ఉండి నాగచైతన్య -సమంత విడాకులపై కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేశారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. మంత్రి వ్యాఖ్యలు తమ కుటుంబ పరువు ప్రతిష్టలను దిగజార్చాయని కోర్టుకు విన్నవించారు. నాగార్జున వాంగ్మూలాన్ని రికార్డ్ చేసింది నాంపల్లి కోర్ట్‌. నాగార్జునతో పాటు కోర్టుకు అమల, నాగ సుశీల, నాగ చైతన్య, వెంకటేశ్వర్లు, సుప్రియ వెళ్లారు. కుటుంబసభ్యుల స్టేట్‌మెంట్‌ను సాక్షులుగా రికార్డ్ చేసింది కోర్టు. అక్టోబర్‌ 10న మళ్లీ విచారిస్తామని వాయిది వేసింది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

TOP 9 ET News: ప్రశాంత్‌ నీల్‌కు NTR కండీషన్