JR NTR: లైపోనా లేక ఓజెంపిక్..? వెయిట్‌ లాస్పై ఎన్టీఆర్ టీం క్లారిటీ..!

Updated on: Apr 18, 2025 | 3:26 PM

దుబాయ్ టూర్ లో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ఫొటో ప్రస్తుతం వైరల్​గా మారింది. ఆ పిక్లో బక్కచిక్కిపోయిన ఎన్టీఆర్​ను చూసి ఫ్యాన్స్​తో పాటు అందరూ షాక్​కు గురయ్యారు. దీంతో తారక్ ఆరోగ్య పరిస్థితిపైనా ఆనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన ఓజెంపిక్ చికిత్స తీసుకోవడమే సన్నబడేందుకు కారణమన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఎన్టీఆర్ నిజంగానే ఆ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారా..? అసలు ఓజెంపిక్ అంటే ఏంటి..? ఎన్టీఆర్ ఓజెంపిక్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారంటూ వస్తున్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదట. ఎన్టీఆర్​ ఓజెంపిక్ చికిత్స తీసుకోవడం లేదని ఆయన టీం స్పష్టం చేసింది. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న NTR 31 మూవీ కోసం తారక్ బక్కచిక్కారని చెబుతోంది. ఎన్టీఆర్ ఆరోగ్యంగా ఉన్నాడని, ఫిట్ నెస్ కోసం ఫిబ్రవరి నుంచి కొత్త డైట్ ఫాలో అవుతున్నాడని క్లారిటీ ఇచ్చింది. ఎన్టీఆర్ బరువుపై ఇలాంటి వదంతులు రావడం ఇదే మొదటిసారి కాదు.. గతంలో రాఖీ మూవీ తర్వాత ఆయన భారీగా బరువు తగ్గి స్లిమ్ గా తయారయ్యాయి. దీంతో అప్పట్లో తారక్ లైపోసక్షన్ చేయించుకున్నారని ఊహాగానాలు రావడంతో అప్పట్లో తారక్ క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు కూడా మళ్లీ అలాంటి పుకార్లే వస్తుండటంతో ఆయన టీం స్పష్టతనిచ్చింది. తాజాగా ఎన్టీఆర్ బరువు తగ్గడంపై అతని సోదరుడు కల్యాణ్ రామ్ కూడా స్పందించారు. తారక్ ఏం చేసినా సినిమా కోసమేనని క్లారిటీ ఇచ్చారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

థాయ్‌ సాంగ్‌కు డ్యాన్స్‌ ఇరగదీసిన స్కూల్‌ పిల్లలు

జూనియర్ ఎన్టీఆర్ పై హాలీవుడ్ హీరో కామెంట్స్.. ఇప్పుడు ఎగరేయండి కాలర్

ఏడుపు ఆపని బిడ్డ… కన్న తల్లి ఏం చేసిందో చూస్తే షాక్‌

క్రికెట్‌ అభిమానులకు గుడ్‌న్యూస్‌.. ఇక నుంచి ఫ్రీ వై-ఫై ఇంటర్నెట్‌

Samantha: సమంతకు అమెజాన్ ప్రైమ్ బిగ్ ఝలక్.. అభిమానుల‌కి ఊహించని షాక్