Ram Charan: రామ్ చరణ్ కోసం సుకుమార్ ఓల్డ్ స్కూల్‌

Updated on: Dec 11, 2025 | 3:50 PM

రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్‌లో RC17 రాబోతోంది. రంగస్థలం, పుష్పల మాదిరి రూరల్ డ్రామా కాదని, ఈసారి సుకుమార్ స్టైలిష్ యాక్షన్ డ్రామాను ప్లాన్ చేస్తున్నారు. పాత సుకుమార్‌ను కొత్తగా చూపించబోతున్నారు. సినిమాలోని సగానికి పైగా షూటింగ్ విదేశాల్లో జరగనుందని, చరణ్‌ను మోడన్, హై-వోల్టేజ్ లుక్‌లో చూపించబోతున్నారని తెలుస్తోంది.

రామ్ చరణ్, సుకుమార్ సినిమా ఎలా ఉండబోతుంది..? ఇంకెలా ఉంటుంది.. రంగస్థలం, పుష్ప లాంటి సినిమాల తర్వాత మరోసారి రూరల్ బ్యాక్‌డ్రాప్‌లోనే లెక్కల మాస్టారు ఏదో పెద్దగా ప్లాన్ చేసుంటారు అనుకుంటున్నారు కదా..? కానీ అదేం కాదు ఈసారి చరణ్ కోసం పాత సుకుమార్‌ను కొత్తగా బయటికి వస్తున్నారని తెలుస్తుంది. మరి RC17 ముచ్చట్లేంటో చూద్దామా… రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్ అనగానే ముందుగా గుర్తుకొచ్చే సినిమా రంగస్థలం. కేవలం చరణ్ కెరీర్‌లోనే కాదు.. టాలీవుడ్ హిస్టరీలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీగా నిలిచింది రంగస్థలం. అందులో చిట్టిబాబుగా చరణ్ నటనకు ఫిదా అయిపోయారంతా. మెగా వారసుడిలో ఇంత గొప్ప నటుడున్నాడా అని ప్రపంచానికి చూపించిన సినిమా రంగస్థలం. రంగస్థలం తర్వాత నటుడిగానూ చాలా ఎదిగారు రామ్ చరణ్. ట్రిపుల్ ఆర్‌లో తన నటనతో గ్లోబల్ ఆడియన్స్‌ను మెప్పించారు. మరోవైపు సుకుమార్ కూడా పుష్ప లాంటి రూరల్ డ్రామాతో ఇండియాను ఏలారు. పుష్ప రెండు భాగాలు కలిసి 2000 కోట్లకు పైగా వసూలు చేసాయి. సుక్కు మాస్ సినిమా చేస్తే ఎలా ఉంటుందో బాక్సాఫీస్‌కు చూపించాయి ఈ సినిమాలు. పుష్ప 3 కూడా ఉంటుందని ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చినా.. దానికంటే ముందు రామ్ చరణ్‌తో ఓ సినిమా చేయబోతున్నారు సుకుమార్. ఈ సినిమా స్క్రిప్ట్‌పైనే బిజీగా ఉన్నారీయన. ఈ క్రమంలోనే ఇది కూడా రూరల్ డ్రామాగానే వస్తుందేమో అని అనుకున్నారంతా. కానీ అక్కడే సుకుమార్ తన మార్క్ చూపిస్తున్నారు.. ఇది మోడ్రన్ స్టైలిష్ డ్రామాగా రాబోతుందని తెలుస్తుంది. రంగస్థలంకు ముందు సుక్కు సినిమాలన్నీ సూపర్ స్టైలిష్‌గా ఉండేవి.. కానీ ఆ తర్వాత మాస్‌లోకి దిగారు లెక్కల మాస్టారు. ఇప్పుడు చరణ్ కోసం మరోసారి హై ఓల్టేజ్ స్టైలిష్ యాక్షన్ డ్రామా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. ఈ సినిమాలో సగానికి పైగా షూట్ విదేశాల్లోనే జరగబోతుందని టాక్. పెద్ది తర్వాత ఈ సినిమాతో బిజీ కానున్నారు రామ్ చరణ్. మరి ఈ స్టైలిష్ డ్రామా ఎలా ఉండబోతుందో చూడాలి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

JioHotstar: ఐసీసీకి జియోహాట్‌స్టార్ బిగ్‌ షాక్

ఆ నాణేలు చెల్లుబాటు అవుతాయా ?? RBI క్లారిటీ

షాకిస్తున్న కొత్త ఆదాయ పన్ను రూల్స్‌ !! ఇక వీరికి దబిడి దిబిడే

12 గంటల ప్రయాణం ఇక 5 గంటల్లోనే.. అబ్బా సాయి రామ్

ఫ్రీ గ్యాస్ కనెక్షన్.. ఇలా దరఖాస్తు చేసుకోండి !!