విజయ్‌నే పెళ్లి చేసుకుంటానన్న రష్మిక.. క్లారిటీ ఇచ్చేసినట్టేనా

Edited By: Phani CH

Updated on: Nov 11, 2025 | 5:58 PM

రష్మిక మందన్న - విజయ్‌ దేవరకొండ పెళ్లి గురించి రోజుకో రకమైన వార్త హల్‌చల్‌ చేస్తోంది ఇండస్ట్రీలో. లేటెస్ట్ గా తాను విజయ్‌ దేవరకొండనే పెళ్లి చేసుకుంటానని రష్మిక డిక్లేర్‌ చేయడంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేవు. అందరూ పదే పదే అడుగుతుండటంతో రష్మిక ఈ మాట చెప్పారా? లేకుంటే తనంతట తానే చెప్పేశారా? లైఫ్‌ పార్ట్ నర్‌ ఎలా ఉండాలో చెప్పేశారు రష్మిక మందన్న.

రష్మిక మందన్న – విజయ్‌ దేవరకొండ పెళ్లి గురించి రోజుకో రకమైన వార్త హల్‌చల్‌ చేస్తోంది ఇండస్ట్రీలో. లేటెస్ట్ గా తాను విజయ్‌ దేవరకొండనే పెళ్లి చేసుకుంటానని రష్మిక డిక్లేర్‌ చేయడంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేవు. అందరూ పదే పదే అడుగుతుండటంతో రష్మిక ఈ మాట చెప్పారా? లేకుంటే తనంతట తానే చెప్పేశారా? లైఫ్‌ పార్ట్ నర్‌ ఎలా ఉండాలో చెప్పేశారు రష్మిక మందన్న. ప్రపంచం మొత్తం తనకు వ్యతిరేకంగా ఉన్నా.. తనకోసం నిలబడే వ్యక్తిని జీవిత భాగస్వామిగా కోరుకుంటున్నట్టు తెలిపారు. అలాంటి వ్యక్తి దొరికితే తన కోసం ఎంతదూరమైనా వెళ్తానంటున్నారు రష్షీ. యుద్ధతంలో తూటాకైనా ఎదురెళ్తా అని ఆమె చెబుతుంటే.. సో క్యూట్‌ అంటున్నారు ఫ్యాన్స్. డేట్‌ చేస్తే ఎవరితో చేస్తారు? పెళ్లి చేసుకుంటే ఎవరిని చేసుకుంటారు? అంటూ ఓ ప్రశ్న విడుదలైంది రష్మిక మందన్నకు. ఏమాత్రం తడుముకోకుండా ఆమె ఇచ్చిన స్టేట్‌మెంట్‌ నెట్టింట్లో వైరల్‌ అవుతోంది. డేట్‌ చేస్తే యానిమేటెడ్‌ కేరక్టర్‌ నరుటోతో చేస్తా. పెళ్లి మాత్రం విజయ్‌ దేవరకొండనే చేసుకుండా అని డిక్లేర్‌ చేశారు రష్మిక. విజయ్‌ – రష్మిక పెళ్లి వార్తలు గత కొన్నాళ్లుగా హల్‌చల్‌ చేస్తూనే ఉన్నాయి. ఇటీవల నిశ్చితార్థం చేసుకున్నవారు, ఫిబ్రవరిలో ఓ ఇంటివారు కాబోతున్నారు. రష్మిక చేతికున్న ఉంగరం గురించి కూడా ఈ మధ్య చాలా సందర్భాల్లో డిస్కషన్స్ జరిగాయి. ప్రేక్షకులను సస్పెన్స్ లోనే పెట్టేస్తున్నారు రష్మిక మందన్న. తన నిశ్చితార్థం గురించి ఫ్యాన్స్ ఏమనుకుంటున్నారో అది నిజం అని కూడా హింట్‌ ఇచ్చారు. రీసెంట్‌గా రష్మిక నటించిన ది గర్ల్ ఫ్రెండ్‌ రిలీజ్‌ అయింది. ఈ సినిమాకు ఫస్ట్ నుంచి విజయ్‌ చేస్తున్న సపోర్ట్ గురించి కూడా ప్రస్తావించారు నేషనల్‌ క్రష్‌.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Brahmos missiles: మన బ్రహ్మోస్‌కు మస్తు గిరాకీ.. కొనేందుకు క్యూ కడుతున్న దేశాలు

H-1B Visa: అమెరికా వెళ్లాలనుకునేవారికి షాకింగ్‌ న్యూస్‌

మీరు కొన్న బంగారం ఒరిజనలేనా ?? గుంటూరులో నకిలీ హాల్ మార్క్ దందా

పేకాట రాయుళ్లకు కోర్టు.. శ్రీకాకుళం కోర్ట్ వినూత్న శిక్ష

ప్రేమించలేదని పగబట్టి.. జైలు పాలైన లేడీ కిలాడీ